हिन्दी | Epaper

News telugu: Atchannaidu: ఎరువుల కొరతలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

Sharanya
News telugu: Atchannaidu: ఎరువుల కొరతలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ: రాష్ట్రంలో ఎరువులకు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. నేడు ఆయన విజయవాడ(Vijayawada)లోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్ని రకాల ఎరువులు సరిపడా నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికా రులతో ప్రతిరోజూ సమీక్షలు జరుగుతున్నాయి. మార్కెట్లో ఎరువుల కొరత లేకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరాలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

News telugu
News telugu

రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా

రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఖాధికా అండగా నిలుస్తుందని, ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చూడటమే లక్ష్యమని మంత్రి పేర్కొ న్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే రైతుల సమస్యల పరిష్కారం మా మొదటి కర్తవ్యం అని మంత్రి స్పష్టం చేశారు. ఎరువుల కొరత పేరుతో రైతులను మోసం చేయాలనుకునే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు (Atchannaidu)హెచ్చరించారు. రైతులసమస్యలు వెంటనే పరిష్కరించేలా జిల్లాకలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులు 24 గంటలు పనిచేస్తున్నా రని తెలిపారు. రాష్ట్రంలోని సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద 82,054 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. వివిధపోర్టుల నుండి, తయారీసంస్థల నుండి 29,236, మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలకు రవాణా దశలో ఉందన్నారు. 1,06,412 మెట్రిక్ టన్నుల యూరియా పలు పోర్టులు, తయారీసంస్థల ద్వారా రాష్ట్రా నికి సెప్టెంబర్ నెలాఖరకు చేరుకుంటాయని అన్నారు. రైతుల అవసరాలను గుర్తించిన కేంద్రం రాష్ట్రానికి మరో 24,894 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారని, ఈనెల 15 తేదీ నుండి 22వ తేదీ లోపు విశాఖపట్నం పోర్టుకు యూరియా చేరుకుంటుందని తెలిపారు. ఈ యూరియా నిల్వలతో కరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా అందరికి లభిస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా యూరయా కొరత అనే మాట వినిపించదని అచ్చెన్నాయుడు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/former-cm-jaganmohan-reddys-false-campaign-against-medical-colleges-home-minister-anitha/andhra-pradesh/546404/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870