పక్క దేశాల నుంచి వలసగా వచ్చే అరుదైన విదేశీ పక్షులకు కొందరు వేటగాళ్లు మృత్యువుగా మారుతున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో చేపల చెరువుల సమీపంలో స్వదేశీతో పాటు విదేశీ పక్షులను నాటు తుపాకులతో(Migratory Birds) కాల్చి చంపుతున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ, చెరువుల వద్ద తుపాకుల మోత మోగించడం స్థానికుల్లో భయాన్ని కలిగిస్తోంది.
Read Also:Tirupati Crime : తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ప్రతి ఏడాది నైజీరియా దేశం నుంచి వలసగా వచ్చే పక్షులు ఈ ప్రాంతంలోని చెరువుల వద్ద కొంతకాలం గడిపి తిరిగి తమ గమ్యస్థానాలకు(Migratory Birds) వెళ్తుంటాయి. అయితే ఈసారి ఆ పక్షులతో పాటు స్వదేశీ పిట్టలు, కొంగలపై కూడా వేటగాళ్లు కన్నేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆకాశంలో ఎగిరే పక్షులపైకి తూటాలు పేలుస్తూ, వాటిని వేటాడి వండుకుని తినేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చేపల చెరువుల నిర్వాహకులు పక్షులు చేప పిల్లలను తింటున్నాయన్న కారణాన్ని చూపుతూ, ఒంగోలు నుంచి ప్రత్యేకంగా వేటగాళ్లను రప్పించి నాటు తుపాకులు అందించినట్లు సమాచారం. చెరువు గట్లపై నిలబడి విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో రోజూ వందలాది పక్షులు బలవుతున్నాయి. ఈ కాల్పుల శబ్దాలతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ప్రాణభయంతో జీవిస్తున్నారు.
ఒకవైపు తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచుతుంటే, మరోవైపు ప్రకాశం జిల్లాలో ఇలా అక్రమ వేట జరగడం బాధాకరమని స్థానికులు అంటున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు గుర్తుచేస్తూ, అధికారులు వెంటనే స్పందించి తుపాకులను స్వాధీనం చేసుకుని అక్రమ వేటను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: