పంచాంగం ప్రకారం మాఘమాసం ముగిసిన వెంటనే శుక్రమూఢం కూడా ముగియనుంది. ఈ నెల 17న అమావాస్యతో శుక్రమూఢం పరిసమాప్తం అవుతుంది. తదుపరి ఫాల్గుణ మాసం 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫాల్గుణ శుద్ధ విదియ అంటే 19వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలు అందుబాటులోకి వస్తాయి. ఆ రోజు నుంచి ఏడాది మొత్తం శుభ ఘడియలు కొనసాగుతాయని పండితులు సూచిస్తున్నారు.
Read also: Shivaratri 2026: ఉపవాసం తర్వాత ఇలా చేయండి

These are the auspicious dates for marriages in 2026
నెలలవారీగా అనుకూలమైన తేదీలు
ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీలు శుభకరంగా భావించబడుతున్నాయి. మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీలు ముహూర్తాలుగా నిర్ణయించారు. ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు, మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు అనుకూలం. జూన్‌లో 21 నుంచి 27 వరకు అలాగే 29 తేదీ, జూలైలో 1, 6, 7, 11 తేదీలు శుభ సమయాలు.
ఏడాది చివర్లో ముహూర్తాలు
నవంబర్‌లో 21, 24, 25, 26 తేదీలలో వివాహాలకు అనువైన సమయాలు ఉన్నాయి. డిసెంబర్‌లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు శుభ ముహూర్తాలుగా పేర్కొన్నారు. మొత్తం 2026 సంవత్సరంలో కేవలం 53 రోజులు మాత్రమే వివాహాలకు అనుకూలంగా ఉండటం విశేషం. అందువల్ల ముందుగానే తేదీలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు పండితులను సంప్రదించి తగిన ముహూర్తం ఖరారు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: