Manchu Manoj: నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పెను మార్పుకు శ్రీకారం చుట్టింది. 13 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించేలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
Read Also: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
ప్రభుత్వాల కీలక నిర్ణయం: వయోపరిమితి విధింపు
“13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించేలా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి చొరవ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వానికి, సిద్ధరామయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇది చాలా ప్రశంసనీయం. యువత ఆలోచనా దృక్పథాన్ని రక్షించే దిశగా సరైన సమయంలో తీసుకున్న ఆలోచనాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను”
”ఒక తండ్రిగా, అలాగే పిల్లలకు సంబంధించిన రంగంలో పని చేసే వ్యక్తిగా.. నేటి తరం పిల్లల్లో దూకుడు స్వభావం, తప్పుడు సమాచారం, వ్యసనపరులుగా మారే ప్రవర్తనలు ఎలా నెమ్మదిగా అలవాటుగా మారిపోతున్నాయో నేను స్వయంగా గమనిస్తున్నాను. పిల్లలు ఎదుగుతున్న కీలకమైన దశలో వారిని సంరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఇలాంటి రక్షణ చర్యలతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నాను” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: