మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై హైకోర్టు అసహనం
విజయవాడ : మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై (Machilipatnam Municipality) హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని సంబంధిత అధికారిని ఆదేశించింది. హైకోర్టు (High Court) ఆదేశాలంటే నవ్వులాటలా ఉందని మండిపడింది. కోర్టు పవరేంటో చూపిస్తాంమని. ఒక అధికారిని లోపలికి పంపితే అందరూ దార్లోకి వస్తారని, చట్టం కంటే తాము ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. వారిని ఎక్కడ నిలబెట్టాలో మాకు తెలుసు అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తమ ఆదేశాలని పట్టించుకోని కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హెచ్చరించింది. వివరణ ఇస్తూ అఫిడవిట్ వేయాలని విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఆక్యుపెన్సీ ధ్రువపత్రం జారీ చేసే విషయంలో హై కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
Read also: Andhra Pradesh: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు
తాము సమర్పించే డాక్యుమెంట్స్ పరిశీలించి సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను మచిలీపట్నం మున్సిపల్ (Machilipatnam Municipality) కమిషనర్ పట్టించుకోలేదన్నారు. విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది వై. నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పార్టీ కార్యాలయం విషయంలో అధికారులు కక్షతో వ్యవహరిస్తున్నారని అన్నారు. న్యాయస్థానాలు చెప్పినా పదే పదే వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారని తెలిపారు. అంతిమంగా ధ్రువపత్రం నిరాకరణకు ఉత్తర్వులిచ్చారని వివరించారు. నిర్మాణ పనులు ఆపాలంటూ నోటీసులిచ్చారని అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ కమిషనర్కు ఆంగ్లం రాదనుకోవాలా? కోర్టు ఉత్తర్వులు అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా అని మండిపడ్డారు. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: