విజయవాడ : లిక్కరు స్కామ్ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్పై విచారణ జరిపేలా విజయవాడ ఏసిబీ(ACB) కోర్టును ఆదేశించాలంటూ నిందితుడు (Liquor scam) సజ్జల శ్రీధర్రెడ్డి పీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దానిపై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు తగిన నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
Read also: నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు

ఏసీబీ కోర్టు డాకెట్ ఉత్తర్వులను సవాల్ చేసిన సజ్జల శ్రీధర్రెడ్డి
డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయాలని వేసిన పిటీషన్ ను విజయవాడ(Liquor scam) ఏసీబీ కోర్టు రిటర్న్ చేయడాన్ని సవాలు చేస్తూ సజ్జల శ్రీధర్ రెడ్డి హైకోర్టులో తెలిసిందే. వ్యాజ్యం వేసిన విషయం న్యాయవాది అభయ్ సిద్దాంత్ వాదనలు వినిపిస్తూ… రెగ్యులర్ బెయిలు పిటీషన్లను విచారించాలని, డిఫాల్ట్ బెయిలు పిటీషన్లపై కాదని సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో తన పిటీషన్పై విచారణ జరపలేదంటూ బెయిలు పిటీషన్ ను రిటర్న్ చేస్తూ ఏసీడీ కోర్టు గత నెల 29న డాకెట్ ఉత్తర్వులిచ్చిందన్నారు. ఏసీబీ కోర్టు ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలి తప్ప విచారణ జరపలేమని పిటీషన్ న్ను రిటర్న్ చేయడం తగదన్నారు. పిటీషన్ కు నంబరు కేటాయించి, విచారణ జరిపేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: