हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu Naidu : చంద్రబాబులా రెండుగంటలపాటు నిల్చుని మాట్లాడలేరు: అనిత

Divya Vani M
Chandrababu Naidu : చంద్రబాబులా రెండుగంటలపాటు నిల్చుని మాట్లాడలేరు: అనిత

ఉదయం లేచి నాలుగైదు టాబ్లెట్లు మింగి, పది సంతకాలు చేయగానే చేతులు వణికిపోతున్న వాళ్లు కూడా… 76 ఏళ్ల చంద్రబాబు (Chandrababu) వ్యక్తిత్వం, శ్రమపై కామెంట్లు చేయడం నిజంగా హాస్యాస్పదమని హోంమంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) ఘాటుగా స్పందించారు. ఇవాళ్టి నాయకుల విమర్శలు మూడో తరగతి స్థాయిలో ఉన్నాయంటూ ఆమె తీవ్రంగా విసుర్లు వెల్లగక్కారు.చంద్రబాబులా రెండు గంటలపాటు నిలబడి, ఒకే అంశంపై ఎదుటివారిని ఉత్తేజపరిచేలా ఎవరైనా మాట్లాడగలరా? అని అనిత చురకలేసారు. రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవ చేసిన నేతపై చులకనగా మాట్లాడటం సరికాదని, ఇది ఆరోపణలు కాదు, అవమానం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.(Chandrababu Naidu)

Chandrababu Naidu : చంద్రబాబులా రెండుగంటలపాటు నిల్చుని మాట్లాడలేరు: అనిత
Chandrababu Naidu : చంద్రబాబులా రెండుగంటలపాటు నిల్చుని మాట్లాడలేరు: అనిత

పేర్ని నాని వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత

వైసీపీ నాయకుడు పేర్ని నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబుపై కాకుండా ప్రజాస్వామ్యవ్యవస్థపై దాడి అని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. ఒకవైపు ‘చీకట్లో కన్నుకొడతాం’, మరోవైపు ‘బహిరంగంగా చంపమంటాం’… ఇవన్నీ మానవత్వాన్ని తాకట్టు పెట్టే మాటలు, అని ఆమె అన్నారు.

76 ఏళ్ల వయసులోనూ 18 గంటల శ్రమ

చంద్రబాబు వయసు 76. కానీ రోజుకు 18 గంటలు పని చేస్తారు. రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్‌ తీసుకురావాలన్న తపన ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తిపై ఇలా మాట్లాడటం దారుణం, అని అనిత చెప్పారు. నేతలంతా రాజకీయ శత్రుత్వం పేరుతో వ్యక్తిగత విమర్శలకు దిగకూడదని ఆమె సూచించారు.

నాయకులకు ఉండవలసిన బాధ్యత ఎక్కడ?

మున్ముందు మంత్రులు, మాజీ స్పీకర్లు బాధ్యతతో వ్యవహరించాలి. నిబద్ధతగా ఉండాలి. కానీ ఆ స్థానాల్లో ఉన్నవాళ్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా? అంటూ ఆమె ఉగ్ర స్వరం బయటపడింది. రాజకీయాల్లో విమర్శలు అవసరం. కానీ అవి వ్యక్తిగత విమర్శలుగా మారకూడదు అన్నది అనిత ప్రధాన సందేశం.

Read Also : Chandrababu : ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870