ఉమ్మడి చిత్తూరు జిల్లాప్రతినిధుల సమావేశం
పుంగనూరు (చిత్తూరు) :ఆంధ్రప్రదేశ్ లో వాల్మీకి, బోయ కులస్తులకు ఎస్టీ రిజర్వేషన్, పునరుద్ధరించేంత వరకు పోరాటాలు కొనసాగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షుడు (President of the State Valmiki Society) కనుమ కుంట సుకుమార్ బాబు స్పష్టం చేశారు. కమ ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన బోయ వాల్మీకి సంఘం కృతజ్ఞతలు సమావేశం ఆదివారం పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుకుమార్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం వాల్మీకులను ఎస్టీలుగా పరిగణిస్తామని మాట చెప్పి తప్పినందువల్ల ఆ పార్టీకి బుద్ధి చెప్పామన్నారు.
తమ ప్రభుత్వం కృషి చేస్తుందని
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మాట ఇచ్చిందన్నారు. అయితే, రాష్ట్రంలో ఆర్థికపరమైన సమస్యల వల్ల కూటమి ప్రభుత్వానికి గడువు కేటాయించామన్నారు. దేశంలో వాల్మీకులను గిరిజనులుగా పరిగణించిన తొలి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు ప్రముఖ స్థానం ఉందన్నారు. గతంలో రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించారని, ఆ తరువాత రిజర్వే షన్ తొలగించారన్నారు. రెండు దశాబ్దాలు గా వాల్మీకుల రిజర్వేషన్లపై పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదన్నారు.

దయనీయ పరిస్థితిపై
ఈ సమావేశంలో సీనియర్ వాల్మీకి సంఘ నాయకులు కుప్పం సురేష్, అద్దాల నాగరాజు, న్యాయవాది ఎల్. భాస్కర్లు మాట్లాడుతూ సమాజంలో అణగారిపోయిన వృత్తుల కుటుం బాలలో వాల్మీకుల దయనీయ పరిస్థితిపై భారత మానవ హక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని వివరించారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం, మాడి శంకరప్ప, వి కోట జయ చంద్ర, రెంటకుంట్ల నరసింహులు, బొమ్మనపల్లి ముని స్వామి, కొలిమి శ్రీనివాసులు, టైలర్ శ్రీనివా సులు, పెద్ద పంజాని గంగప్ప, ఏ. కొత్తకోట చిన్న, కే. రెడ్డప్ప, సోమల శంకరప్ప, శ్రీనివా సులు, వెంకటస్వామి, వెంకటేష్ నేటిగుట్లపల్లి శ్రీనివాసులు, ఈడిగపల్లి నరేష్, బ్యాంకు రాజ శేఖర్, రిటైర్డ్ టీచర్ రెడ్డప్పలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Read hindi news:
Read Also: