ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (DDU-GKY) కింద ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ పథకం ద్వారా యువతకు ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు నేర్పించి, శిక్షణ పూర్తైన తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామీణ యువతకు పెద్ద అవకాశంగా మారింది.
Read also: Health Department:త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

An opportunity for unemployed youth
ఉచిత శిక్షణ, భోజనం, వసతి – అన్ని సౌకర్యాలు అందుబాటులో
ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. అభ్యర్థులకు శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. ప్రతి కోర్సు కనీసం 90 రోజుల పాటు ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం, సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో విద్యార్థిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఈ శిక్షణను ఏపీ సీడాప్ సంస్థ పర్యవేక్షిస్తోంది.
ఎవరు అర్హులు? ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల గ్రామీణ యువత ఈ శిక్షణకు అర్హులు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న కుటుంబాల పిల్లలు, స్వయం సహాయక సంఘాల మహిళల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఆటోమోటివ్ అసెంబుల్ అసిస్టెంట్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, హోమ్ హెల్త్ ఎయిడ్, టెలికాం టెక్నీషియన్, సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
శిక్షణ అనంతరం ఉద్యోగం – భవిష్యత్తుకు భరోసా
శిక్షణ పూర్తైన తర్వాత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. అనంతరం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మొత్తం 505 మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు సీడాప్ జాబ్స్ మేనేజర్ అశోక్‌ను 87124 95518 నంబర్‌లో సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: