కర్నూలు(Kurnool Accident) జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. వేమూరి కావేరి ట్రావెల్స్‌కు(Kaveri Travels) చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసినట్లు ఉలిందకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయనను A1గా, బస్సు యజమానిని A2గా గుర్తించారు. ప్రస్తుతం యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Chennai Crime: చెన్నైలో ప్రయాణికురాలిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ లైంగిక దాడి

నెల్లూరు(Kurnool Accident) జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన 10 నిమిషాల ముందు ఆ మార్గంలో ప్రయాణించిన 35 మంది డ్రైవర్లను విచారించగా, డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేల్చారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మరింత సమాచారం సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: