
కృష్ణా జిల్లా (Krishna District)పెదపారుపూడి మండలం భూషణగుళ్ల గ్రామంలో శుక్రవారం జరిగిన కోడి పందేలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పండుగ వాతావరణంలో సరదాగా ప్రారంభమైన పందేలు చివరకు రక్తపాతంగా మారడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. కోడి పందేల బరిలో తలెత్తిన గొడవలో అనగాని జగన్నాథం అనే వ్యక్తిపై ప్రత్యర్థులు కోడి కత్తితో పీకపై దాడి చేయడం తీవ్ర సంచలనంగా మారింది.ఈ ఘటనలో జగన్నాథానికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్థానికులు అతడిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: Nellore: ఇసుకపల్లి సముద్రం లో గల్లంతైన విద్యార్థుల వివరాలు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: