దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే యశ్వంత్‌పూర్–మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్ (Kondaveedu Express) ట్రైన్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆపరేషనల్ కారణాల వల్ల సమయాలను సవరించినట్లు అధికారులు తెలిపారు. కొత్త సమయ పట్టికను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. ఇప్పటివరకు మధ్యాహ్నం 1.15కు యశ్వంత్‌పూర్(Yeshwantpur) నుంచి బయలుదేరే ఈ రైలు, ఇకపై 12.45కి ముందుగానే ప్రయాణం ప్రారంభించనుంది.
Horticulture Hub : హార్టికల్చర్ హబ్ కు రూ. 40వేల కోట్లు ఇవ్వబోతున్న కేంద్రం – చంద్రబాబు ప్రకటన

కొత్త టైమ్ టేబుల్
కొత్త షెడ్యూల్ ప్రకారం, కొండవీడు ఎక్స్‌ప్రెస్(Kondaveedu Express) 12.45కు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, 1.05కు యలహంక, 2.10కు హిందూపూర్, 2.40కు పెనుకొండ, 3.01కు సత్యసాయి ప్రశాంతినిలయం, 3.55కు ధర్మవరం, 4.33కు అనంతపురం చేరుతుంది. తర్వాత 5.28కు గుత్తి, 6.28కు డోన్, 7.03కు బేతచర్ల, 8.20కు నంద్యాల, 8.59కు గిద్దలూరు, 9.29కు కంభం, 9.59కు మార్కాపూర్ రోడ్, 10.24కు దొనకొండ, రాత్రి 12.24కు నరసరావుపేటలో ఆగుతుంది.
తరువాత ఈ రైలు అర్ధరాత్రి 1.00కు గుంటూరు, తెల్లవారుజామున 2.50కు విజయవాడ, 3.48కు పెనుగంచిప్రోలు చేరుకుని, ఉదయం 5.15కు తుది గమ్యం మచిలీపట్నానికి చేరుకుంటుంది. ఈ కొత్త టైమ్ టేబుల్ వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి అమల్లోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. జనవరి తర్వాత ప్రయాణించే వారు ఈ సవరించిన షెడ్యూల్‌ను అనుసరించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: