Konaseema feast : సంక్రాంతి పండుగ వేళ కోనసీమలో ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి ఇచ్చిన ఆతిథ్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా 1,574 రకాల వంటకాలతో భారీ విందు ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల అతిథి సత్కార సంప్రదాయానికి మరోసారి ఘనత తెచ్చారు. ఈ విశేష ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామంలో జరిగింది.
ఆదుర్రుకు చెందిన విజ్జెపు వెంకటరత్నం, సుశీల దంపతులు తమ కుమార్తె కీర్తిశ్రీని గత ఏడాది ఫిబ్రవరిలో పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన సాయి శరత్‌కు వివాహం చేశారు. ఈ సంక్రాంతి దంపతులకు తొలి పండుగ కావడంతో, గురువారం అల్లుడు సాయి శరత్ అత్తవారింటికి వచ్చాడు.
Read also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!
ఈ సందర్భంగా అల్లుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రత్యేక విందు ఇవ్వాలని నిర్ణయించిన అత్తమామలు అపూర్వమైన ఏర్పాట్లు చేశారు. సంప్రదాయ పిండివంటలు, వివిధ రకాల కూరలు, స్వీట్లు, పండ్లు, శీతల పానీయాలు (Konaseema feast) సహా మొత్తం 1,574 రకాల పదార్థాలతో విందు సిద్ధం చేశారు. అంతేకాదు, ఏడాదిలోని 12 నెలలను సూచిస్తూ అల్లుడికి 12 ప్రత్యేక బహుమతులు అందించి తమ ప్రేమను వ్యక్తం చేశారు.
ఈ అరుదైన ఆతిథ్యాన్ని చూసి అల్లుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవలి కాలంలో గోదావరి జిల్లాల్లో కొత్త అల్లుళ్లకు భారీ విందులు ఏర్పాటు చేసే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గతంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో 1,116 వంటకాలతో విందు ఏర్పాటు చేయగా, విశాఖలో 290 రకాల వంటకాలు, తెనాలిలో 158 వంటకాలతో అల్లుళ్లకు విందులు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా ఆదుర్రులో ఏర్పాటు చేసిన ఈ విందుతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: