हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

నానికి హైకోర్టులో స్వల్ప ఊరట

Anusha
నానికి హైకోర్టులో స్వల్ప ఊరట

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ కేసుల్లో చిక్కుకున్న వైసీపీ నేతలు కోర్టులను ఆశ్రయిస్తూ క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కొందరు నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆ కేసుల్లో విచారణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో అరెస్ట్ భయంతో పలువురు కోర్టుల తలుపుతడుతున్నారు.

కేసు నమోదు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై గత నవంబర్‌లో విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.గత ప్రభుత్వం హయాంలో ఆయన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి.

హైకోర్టును ఆశ్రయించిన కొడాలి నాని

తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కొడాలి నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.అతను హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.తనపై నమోదు చేసిన కేసుకు ఎటువంటి న్యాయపరమైన బలమైన ఆధారాలు లేవని ఆయన వాదన.ఈ కేసు రాజకీయప్రేరితమని, కక్షసాధింపు చర్యల్లో భాగంగా తనపై కుట్ర జరుగుతోందని ఆయన కోర్టులో పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పు

కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.ఐపీసీ 35(3) సెక్షన్ ప్రకారం, ముందుగా నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని పోలీసులకు సూచించింది.

1031277 ap hc and kodali

కొడాలి నాని కేసులో హైకోర్టు ఇచ్చిన ఊరటనిచ్చే తీర్పుతో వైసీపీ నేతలు కొంత ఊపిరిపీల్చుకున్నా, కేసుల విచారణ మాత్రం కొనసాగుతుంది.న్యాయపరంగా విచారణ సాగుతున్న నేపథ్యంలో, రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.గత ఏడాది నవంబర్‌లో తన వ్యాఖ్యల ద్వారా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లను కించపరిచారన్న ఆరోపణలతో విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొడాలి నానిపై కేసు నమోదైంది.ఆయన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో సెక్షన్ 505(2) (సామాజిక విభజనలకు కారణమయ్యే వ్యాఖ్యలు చేయడం) మరియు సెక్షన్ 506 కింద కేసు పెట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870