వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు నగర మాజీ మేయర్, సీనియర్ వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు (Kavati Manohar) పార్టీ సస్పెన్షన్‌కు గురవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పార్టీ క్రమశిక్షణా సంఘం సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ కార్యాలయం ప్రకటన
వైసీపీ (YCP) కేంద్ర కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, మనోహర్ నాయుడుతో పాటు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి, ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ లను కూడా క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ సస్పెండ్ చేసినట్లు వైసీపీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. వీరిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణా కమిటీ తగిన చర్యలు
చిలకలూరిపేట నుంచి పోటీ, ఆపై రాజీనామా
కావటి మనోహర్ నాయుడు గత ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది మార్చి రెండో వారంలో గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. ఇంకా కావటి మనోహర్ నాయుడు ఈ నిర్ణయంపై స్పందించలేదు. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పరిపాలన శైలిపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read also: Himalayas: హిమాలయాలలో పర్వతారోహితుడు మృతి