हिन्दी | Epaper

Justice lisa gill : ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

Sai Kiran
Justice lisa gill : ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా లీసా గిల్

Justice lisa gill : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభం కానుంది హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్న విషయం ప్రాధాన్యం సంతరించుకుంది

ప్రస్తుతం పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు తీసుకున్నారు

ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు ఆయన పదవీ విరమణ అనంతరం జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also: Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్‌ కు అశ్విన్ కీలక సూచనలు

Justice lisa gill
Justice lisa gill

మొదట ఆమె ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి తరువాత ప్రధాన న్యాయమూర్తిగా పూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ నియామకంతో ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు

జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి పంజాబ్ హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు న్యాయ రంగంలో ఆమెకు ఉన్న అనుభవం మరియు సేవలకు మంచి గుర్తింపు ఉంది

ఆమె నియామకం న్యాయవ్యవస్థలో మహిళలకు మరింత ప్రోత్సాహం కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870