ఒక ఆటవిక సమాజంలో వేటే వృత్తి అయినందువలన వేటాడిన జంతువును సమానంగా పంచుకునేవారు ఆ తర్వాత వచ్చిన బానిస వ్యవస్థలో బానిసలను దోపిడీ చేయ డం, తరువాత వచ్చిన భూస్వామ్య వ్యవస్థలో రైతులదోపిడీ, ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామికుల దోపిడీ, పెట్టు బడిదారులను తప్ప ఇంకెవరిని బాగుపడనీయని పరిస్థితి. ఉద్యోగ కల్పనలేని ఉత్పత్తులను చేసి మిలియనీర్లు బిలియ నీర్లు అయిపోతూ దేశసంపదను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రిడేటరీ గ్రోత్ను కొనసాగిస్తూ ఎల్లప్పుడూ దేశంలో నిరు ద్యోగ సమస్యతో యువత, అప్పుల ఊబిలో ప్రభుత్వాలు కూరుకుపోతున్నాయి. మన దేశంతోపాటు స్వాతంత్ర్యం సంపాదించుకున్న చైనాలో ప్రభుత్వ నియంత్రణలో పెట్టు బడిదారులు ఉన్నందువలన ప్రపంచంలో 80 దేశాలకు అప్పులు ఇవ్వగలిగింది. పెట్టుబడిదారులను నియంత్రించిన చైనాలో ప్రిడేటరీ గ్రోత్ కనిపించదు. ఉద్యోగసమస్యను తీర్చుతూ సంతులిత సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని సాధించ గలిగింది. మన దేశం కూడా 2023 నాటికి చైనా నుండి 11.1 బిలియన్ డాలర్లు అప్పుగా తీసుకున్నది. అయితే చైనా మాత్రం అనేక దేశాలకుఅప్పులిస్తుంటే మన దేశం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2015లో దేశ విదేశీ అప్పులు 56లక్షల కోట్ల రూపాయలు అయితే 2024 నాటికి 185.94 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 10 ఏళ్లలోవిదేశీ అప్పు రెట్టింపు అయింది. సగటు భారతీయుని తలసరి అప్పు 1.27 లక్ష వరకు ఉన్నది.
Read Also: http://True caller: ‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ఈ నేపథ్యంలో మన నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పెరిగిన జీడీపీ ఎవరిది? దేశంలో రావలసిన పన్నులు
కార్పొరేట్లకు రాయి తీల రూపంలో వదులుకోవడంవలన ప్రభుత్వం అప్పు చేయ వలసి వస్తున్నది. కార్పొరేట్లకు పన్ను రాయితీలో ఎన్టి ఏ వన్ హయాంలో 4.3 లక్షల కోట్ల రూపాయలు. 2019-21 మధ్యన 1.85లక్షల కోట్ల రూపాయలు పన్నుల ఆదా యాలు ప్రభుత్వానికి తగ్గిపోయాయి. ఇలా ప్రభుత్వ ఆదా యాలు తగ్గిపోవడం వలన అప్పులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. మరొకవైపు ప్రజలు ద్రవ్యోల్బణానికి గురై జీవన ప్రమాణాన్ని కోల్పోతుండగా ఉపాధి కల్పనకు (Job creation) చేసే ప్రభుత్వ వ్యయం గణనీయంగా పడిపోతున్నది. ఉదాహరణకు 27 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద 2024-25 సంవత్సరానికి 86 వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. పేదలను కూలీలను ఒకరకంగా ధనికులను మరొక రకంగా చూస్తున్న ప్రభుత్వం ఓట్ల కోసం ఉచితాలనుకల్పిస్తూ ఉపాధి కల్పన (Job creation) లేకుండా చేస్తున్నది. 1980లో జాతీయ ఆదాయంలో పెట్టుబడి శ్రామిక వాటా నిష్పత్తి 75 శాతం ఉండగా 2024 నాటికి 29 శాతానికి పడిపోయింది. ఫలితంగా ప్రజల్లో ఆదాయాలు లేక కొనుగోలు శక్తి లేక వినియోగం తగ్గిపోయి ప్రపంచ దేశాలలో మానవాభివృద్ధిలో అత్యంత అల్ప స్థాయిలో భారతీయులు ఉన్నారు. 77వ నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 35శాతం కుటుంబాలు సగటున సుమారు 60వేల రూపాయల వరకు అప్పుల ఊబిలో కూరుకుపో యారు. ముఖ్యంగా ఈ రుణగ్రస్థత 2016 నుంచి 2022 మధ్యకాలంలో పెరిగిపోయింది. వీరు ముఖ్యంగా 40శాతం రైతులు, 30శాతం ఇతరులు ఉన్నారు. సంస్థాగత రుణాలు అంటే బ్యాంకులు తదితర వాటి నుంచి గ్రామీణ వాసులకు లభించిన రుణగ్రస్థత 18 శాతం కూడా లేదు. ఈ గ్రామీణ రుణగ్రస్తుతను పెరుగుదలను నాబార్డ్ ధ్రువీకరించింది. ఇప్పు డు దేశంలో అందరికీ అందని అభివృద్ధి జరుగుతున్నది. అందువలన ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయి. దేశ సంపదలో 58శాతం కేవలం 10శాతం మందికే చేరు తోందని వరల్డ్ యూనిక్వాలిటీ నివేదిక వెల్లడించింది.

అభివృద్ధి ఫలాలు అందరికీ
దేశం ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందినా అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదన్న ఆరోపణల్లో అసత్యం లేదని ఈ వినేదిక తెలియజేస్తోంది. గరిష్ట కనిష్ట ఆదాయాల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిందని ఈ నివేదిక వివరించింది. సంక్షేమ పథకా లను గురించి పదేపదే చెబుతూ సంబంధిత అభివృద్ధికోసమే వీటిని అమలు చేస్తున్నామని చెబుతున్నారు. సంక్షేమ పథ కాల ఫలాలు ఎవరికి చెందాలో వారికి చేరకపోవడం వల్ల సమ్మిళిత అభివృద్ధి జరగడం లేదు. అగ్రశ్రేణిలో ఉన్న పది శాతం ధనవంతులకు అట్టడుగున ఉన్న 50 శాతం మంది పేదల మధ్య 2014 నుంచి 2024 వరకు
ఆదాయంలో అంతరాల స్థిరంగా కొనసాగుతున్నాయని ఆ నివేదిక సూచిం చింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 2014నాటి నుంచి మొదటి 10 సంవత్సరాలలో వ్యత్యాసాలు బాగా పెరిగాయి. అంతరాలను తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రతి సందర్భంలోనూ పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టే పథకాల నిధులన్నీ అగ్రశ్రేణిలో ఉన్న పది శాతం మందికే చేరుతుందని అసమానతల నివేదిక పేర్కొంటుంది. అలాగే దేశంలో కుబేరుల సంఖ్య బాగా పెరుగుతోందని గడిచిన పదేళ్లలో కొత్త కుబేరులు తయార య్యారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఎడిఆర్ ఎన్నికల సందర్భంగా విడుదలచేసే నివేదికలో పేర్కొంటుం ది. గతంలో బిలియనీర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు అలాంటి బిలినియర్లసంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించే మంత్రులు ముఖ్యమంత్రుల సంఖ్య గతంలో కన్నా బాగా పెరుగుతుంది. అయినా మన పాలకులు దేశంలో దోపిడీతో జరుగుతున్న వృద్ధినే ప్రిడేటరీ గ్రోత్ పాలకులు కంపెనీలకు అనేక రాయి తీలు కల్పించుతున్నారు. ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని కార్పొరేట్లు చెబుతున్నారు. అయితే వారు ఆటోమేటిక్ యంత్రాలు లేదా కృత్రిమ మేధాతో పనులు చేపట్టి ఉత్పత్తి కార్యక్రమాలు చేయడం వలన ఉద్యోగ కల్పన అంతంతమాత్రంగానే ఉంది. దీనికి తోడు ఒక్క 2024లోనే ప్రపంచ వ్యాప్తంగా సాప్ట్వేర్ కంపెనీలో ఒక లక్ష యాభైవేల ఉద్యోగస్తులను తీసేశారు. ఇంకో 5 ఏళ్లలో తొమ్మిది లక్షల 20 వేల ఉద్యోగాలు పోతాయని తెలుస్తున్నది. ఈపరిస్థితులలో కంపెనీలుంటే మనపాలకులు మాత్రం వారికి అనేక రాయి తీలు అందిస్తున్నారు. మనదేశంలో నూతన ఆర్థికవిధానాలు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ చేపట్టిన తర్వాత ప్రభుత్వం. పెట్టుబడుల విధానాలే మారిపోయాయి. ఇలాం టి పెట్టుబడిదారీ విధానాన్ని అధిగమించి ప్రిడేటరీఎకానమీని నియంత్రించే విధానాన్ని రూపొందించుకోవాలి.
-డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: