తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించకపోవడంపై జగన్ (Jagan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తీవ్రంగా స్పందించారు.జగన్‌ను ఉద్దేశిస్తూ, “మీ తాత గొప్ప ఫ్యాక్షనిస్ట్ కదా… కానీ ఆయన ఎప్పుడూ ప్రత్యర్థుల ఇళ్లలోకి వెళ్లలేదు” అంటూ జేసీ ఘాటుగా స్పందించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తన ఇంటి వద్దకు వచ్చాడని, అది దురుద్దేశంతోనే జరిగిందని ఆరోపించారు.

పులివెందుల ఘటనను గుర్తు చేసిన జేసీ
జగన్‌కు టార్గెట్ చేస్తూ, నీకు తెలియకపోతే నీ అమ్మని అడుగు… పులివెందులలో మీ కుటుంబం బీఎన్ రెడ్డి ఇంటిని తగలబెట్టింది అంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. జగన్ కుటుంబ గతాన్ని గుర్తు చేస్తూ రాజకీయ వేధింపులు ఎలా జరుగుతాయో ప్రజల ముందు ఉంచారు.పెద్దారెడ్డికి సొంత ఇల్లు ఉందా? అది మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి కట్టిన ఇల్లు అంటూ కేతిరెడ్డి నిర్మాణంపై ప్రశ్నలు లేపారు. ప్రజా స్థలాన్ని ఆక్రమించిన వాడిని “సొంత ఇంటి” విషయంలో మాట్లాడే అర్హత లేదని తేల్చేశారు.
తాడిపత్రిలోకి అడుగుపెట్టే వీలు లేదు
“పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వం. అతని విషయంలో ఎంత దూరమైనా వెళతాం. ఒక వేళ వచ్చాడంటే ప్రజలే తిప్పికొడతారు” అంటూ హెచ్చరించారు. తాడిపత్రి ప్రజలు తమ మీద ఉన్న నమ్మకాన్ని కొలిచే ప్రశ్న ఇది అన్నట్టు మాట్లాడారు.ఈ వ్యాఖ్యలు చూస్తే తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ తరఫున వచ్చిన ఈ కౌంటర్, స్థానికంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎవరి పక్షంలో ఉన్నారో రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.
Read Also : Chandrababu : చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్