South Central Railway update: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం విడుదల చేసింది. విశాఖపట్నం–లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Janmabhoomi Express) రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన టైమింగ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
Read also: ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు
టైమింగ్స్ మార్పు…
రైల్వే తాజా నిర్ణయం మేరకు ట్రైన్ నెంబర్ 12806 (విశాఖపట్నం–లింగంపల్లి) రైలు విశాఖపట్నం నుంచి ఉదయం 6.20 గంటలకు బయల్దేరి, రాత్రి 7.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. అదే విధంగా ట్రైన్ నెంబర్ 12805 (లింగంపల్లి–విశాఖపట్నం) రైలు లింగంపల్లి నుంచి ఉదయం 6.55 గంటలకు ప్రారంభమై, రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు…
ఈ రైలు ప్రయాణంలో అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగనుంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమై దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచలి, తుని, అన్నవరం, సామల్‌కోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నూజివీడు, విజయవాడ(Vijayawada), తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, నడికుడ, మిర్యాలగూడ, నల్గొండ, రామన్నపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ మీదుగా లింగంపల్లి వరకు ఈ ట్రైన్ ఆగుతుందని అధికారులు వివరించారు.
ప్రయాణికులు తమ టికెట్లు బుక్ చేసుకునే ముందు తాజా టైమింగ్స్‌ను గమనించాలని, అసౌకర్యాలు నివారించుకోవడానికి రైల్వే వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్‌లో వివరాలు చెక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :