हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ABV: శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

Vanipushpa
ABV: శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్(Ex CM Jagan) పై విజయవాడలో జరిగింది రాయి దాడి కానే కాదని, అది కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన కట్టుకథ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswararao) సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని, అమాయకుడైన వడ్డెర కులానికి చెందిన సతీశ్(Satish) అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, మనుషుల జీవితాలతో చెలగాటమాడే నైజం జగన్‌దని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

ABV: శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ
ABV: శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ

రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు..
ఏబీ వెంకటేశ్వరరావు నేడు విజయవాడలో ‘రాయి దాడి’ కేసులో నిందితుడిగా చిత్రికరించబడి, 45 రోజుల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపిన సతీశ్‌ను, అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏబీవీ మాట్లాడుతూ, “గజమాల వేసినప్పుడు తగిలిన చిన్న గాయాన్ని ఉద్దేశపూర్వకంగా రాయి దాడిగా చిత్రీకరించి, సానుభూతి పొంది, రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారు. దీనికోసం ఏ పాపం తెలియని ఒక నిరుపేద వడ్డెర యువకుడిని, అతని కుటుంబాన్ని బలిపశువును చేశారు. ఇది రాయి దాడి కాదు, ఒక వడ్డెర బిడ్డ జీవితాన్ని జగన్ నాశనం చేసిన ఉదంతం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
సతీశ్‌పై థర్డ్ డిగ్రీ
“ప్రభుత్వం మారినా, ఆ దుర్మార్గపు కేసును ఇప్పటికీ కొట్టివేయకుండా తిప్పుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారు. సతీశ్‌పై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ చిత్రహింసల గురించి వింటే గుండె తరుక్కుపోతుంది. ఆ యువకుడు ఇప్పటికీ తన చేత్తో అన్నం కూడా తినలేని దయనీయ స్థితిలో ఉన్నాడు. ఇంతటి ఘోరానికి పాల్పడిన పోలీసు అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీని ద్వారా సమాజానికి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? బాధితులు చేసిన తప్పేంటి? ఈ కేసుతో వారికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా, ఎలాంటి సాక్ష్యం లేకపోయినా ఎందుకు ఇంతలా వేధించాలి?” అని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి
ఈ అమానుష ఘటనలో అమాయకులను బలిపశువులను చేసిన బాధ్యులైన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం, డీజీపీ, పోలీస్ కమిషనర్ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సతీశ్‌పై బనాయించిన అక్రమ కేసును వెంటనే మూసివేయాలని, బెయిల్ బాండ్స్‌ను రద్దు చేసి, వారు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా, ప్రభుత్వం బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించి, వారి జీవితాలకు భరోసా కల్పించాలని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ ఘటన జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలకు నిదర్శనమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Andhra: విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

రాజకీయ నేతలను సీరియస్ గా హెచ్చరించిన హైకోర్టు

రాజకీయ నేతలను సీరియస్ గా హెచ్చరించిన హైకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870