हिन्दी | Epaper

AP Capital : జగన్ ఏపీకి రాజధాని లేకుండా చేసాడు – సీఎం చంద్రబాబు

Sudheer
AP Capital : జగన్ ఏపీకి రాజధాని లేకుండా చేసాడు – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని (Capital ) లేకుండా వైఎస్ జగన్‌ చేశాడంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. “మూడు రాజధానుల తంతుతో రాష్ట్ర అభివృద్ధిని కుంగదీసిన జగన్, అమరావతిని నాశనం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడని” వ్యాఖ్యానించారు. వైసీపీ (YCP) హయాంలో నిధుల దుర్వినియోగం, పెట్టుబడిదారులలో భయాన్ని నెలకొల్పిన తీరు వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టాలు వాటిల్లాయని మండిపడ్డారు. కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రానికి అభివృద్ధి బాటలు తిరిగి కనిపిస్తున్నాయని వివరించారు.

సుపరిపాలనతో నూతన దిశ – లక్ష్యంగా 2047 విజన్

సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సమీక్షా కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధరేశ్వరి, లోకేశ్‌ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత ఏడాది చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్ లక్ష్యాలను చర్చించారు. “స్వర్ణాంధ్ర విజన్ – 2047” లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏ విధంగా పటిష్ట పాలన అందిస్తుందో చూపించామని చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు పార్టీలతో కూడిన ప్రభుత్వం ఉన్నా ఎలాంటి విభేదాలు లేకుండా ప్రజలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అమరావతికి నూతన జీవం – సంక్షేమానికి శాస్వత బాట

చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతిని మళ్లీ పట్టాలెక్కించామని, పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టంగా పేర్కొన్నారు. పోలవరం పూర్తి అయితే నీటి సమస్యలు తీరుతాయని, ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు కేటాయించిందన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం పథకం అమలు, రూ.5కు అన్నం అందించే 213 అన్న క్యాంటీన్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,400 కోట్లు సాయం, రైల్వేజోన్ పనుల వేగవంతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. “ఒక్క సంవత్సరం పాలనలోనే ప్రజలకు విశ్వాసం కలిగించగలిగాం, మిగతా కాలంలో అభివృద్ధి పునఃప్రారంభం అయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాల్సిందే” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also : YCP : రాజకీయాలు దిగజారిపోతున్నాయంటూ బొత్స కామెంట్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870