हिन्दी | Epaper

Jagan: నాకు ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా..మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Sharanya
Jagan: నాకు ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా..మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) మోహన్ రెడ్డి మరోసారి తన భద్రత అంశాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఇటీవల కడప జిల్లా రెంటపాళ్ల వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో వైసీపీ కార్యకర్త సింగయ్య (Singaya) మృతి చెందిన ఘటనకు సంబంధించి జగన్‌ను నిందితుడిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన నేపథ్యంలో ఆయన స్పందన తీవ్రంగా మారింది. ఈ సంఘటన నేపధ్యంలో తనకు జడ్ ప్లస్ భద్రత అసలు అమలవుతున్నదా? లేక కేవలం పేరుకేనా? అనే అనుమానాన్ని జగన్ బహిరంగంగా ఎత్తిపోశారు.

జగన్ ప్రశ్నల వర్షం

జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించారు.

ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది తనకు ఆటోమేటిక్‌ హక్కు అని మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడుతన వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు. రోప్ పార్టీలు ఉంటే సింగయ్య మరణం సంభవించేది కాదని జగన్ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

వైసీపీ నేతల నిరసన

ఈ అంశంపై వైఎస్సార్సీపీ నేతలు కూడా స్పందించారు. పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ- జగన్‌కి భద్రత కల్పించడంలో పోలీసులు తరచూ విఫలమవుతున్నారని రెంటపాళ్ల పర్యటనలోనూ ఈ వైఫల్యం స్పష్టంగా కనిపించిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్య నారాయణ అన్నారు. జగన్‌కి ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించి ఉంటే సింగయ్యకు ప్రమాదం జరిగినప్పడు పోలీసులు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు బొత్స.

ప్రభుత్వ స్పందన

ఇక ప్రభుత్వ వైపు నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ జగన్ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె చెప్పినది ఇలా జగన్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ కంటే ఎక్కువ భద్రత ఇచ్చామని రెంటపాళ్ల పర్యటనలో జగన్, వైసీపీ నేతలు పోలీసుల రూల్స్‌ ఎందుకు ఫాలో అవ్వలేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు.

Read also: Guntur: డబ్బు కోసం ముగ్గురి ప్రాణాలు తీసిన ముఠా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870