గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్బంగా, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jagan) పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపారు.
Read Also: AP: టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం
విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు

2026 సంవత్సరానికి కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించిన సందర్భంగా ఆయన స్పందిస్తూ, “తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను” అని వైఎస్ జగన్ (YS Jagan) పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు లభించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: