రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Irrigation Projects) పనులను తామే నిలిపివేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ పనులు ఆపినట్లు రేవంత్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలను పూర్తిగా అసంబద్ధమైనవిగా అభివర్ణించింది.
Read also: Sankranti: సంక్రాంతి సీజన్‌లో ప్రైవేటు బస్సుల ఛార్జీల మోత

చంద్రబాబు నాయుడు పేరును కేంద్రంగా చేసుకుని తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ప్రజా ప్రయోజనాలకన్నా రాజకీయ లబ్ధికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించింది.
నీటి హక్కులు, సాగునీటి ప్రయోజనాలపై రాజీ లేదు
రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి(Irrigation Projects) అవసరాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సీమ ప్రజల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఈ అంశంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: