हिन्दी | Epaper
ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం

Indrakeeladri: అంబరాన్నంటిన శాకంబరి ఉత్సవ సంబరాలు

Ramya
Indrakeeladri: అంబరాన్నంటిన శాకంబరి ఉత్సవ సంబరాలు

Indrakeeladri (విజయవాడ): ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం నాడు జగన్మాత దుర్గమ్మ వారు శాకంబరి దర్శించుకోటానిక భక్తజనం తరలివచ్చారు. క్యూలైన్లన్నీ మాతగా వెల్లువలా భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు త్వరితంగా దర్శనమయ్యేలా ఇఓ వికె శీనా నాయక్ (EO VK Sheena Naik) చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం కలియతిరుగుతూ భక్తుల సౌకర్యాలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. దుర్గమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు కదంబ ప్రసాదాన్ని అందించారు.

Indrakeeladri: అంబరాన్నంటిన శాకంబరి ఉత్సవ సంబరాలు
Indrakeeladri: అంబరాన్నంటిన శాకంబరి ఉత్సవ సంబరాలు

నేడు గిరి ప్రదక్షణ:

దుర్గమ్మ వారు వేంచేసియున్న ఇంద్రకీలాద్రి (Indrakeeladri) గిరి ప్రదక్షణ కార్యక్రమం (Giri Pradakshan program) గురువారం ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5.55లకు ఘాట్రోడ్డులో వేంచేసియున్న శ్రీ కామధేను ఆలయం వద్ద ప్రారంభిస్తామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. ఈ వ్యాసపౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలన్నారు.

నేడు పూర్ణాహుతి :

10 వ తేదీన గురువారం సప్తశతీ పారాయణం, మహావిద్యా పారాయణము, హోమము, శాంతి పౌష్టిక హోమాలు, మంటపపూజ, ఉదయం 9.30కు పూర్ణాహుతి నిర్వహిస్తారు. దుర్గమ్మవారి ఆలయంలో బుధవారం కోలాటం, నృత్యప్రదర్శనలు భక్తులను అలరించాయి.

శాకంబరిగా భక్తులను అనుగ్రహిస్తున్న దుర్గమ్మ

విజయవాడకు చెందిన శ్రీవాగ్దేవి నృత్యాలయం విద్యార్థులు నృత్యాచార్యులు సప్ప శివకుమార్ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. దుర్గమ్మవారిని ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఇఓ దుర్గమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటో అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించగా ప్రసాద్ ఇఓను అభినందించారు.

ఇంద్రకీలాద్రి చరిత్ర ఏమిటి?

ఇంద్రకీలాద్రి పర్వతం దేవతల కోరిక మేరకు ఇంద్రుడి ప్రార్థనతో కీళించి ఏర్పడింది. ఇది కనకదుర్గ అమ్మవారి పవిత్ర నివాసంగా పౌరాణిక గ్రంథాల్లో పేర్కొనబడింది.

ఇంద్రకీలాద్రి అంటే ఏమిటి?

ఇంద్రకీలాద్రి అంటే “ఇంద్రుని ద్వారా స్థిరపరచబడిన పర్వతము” అని అర్థం.
ఇందులో “ఇంద్ర” అంటే దేవేంద్రుడు, “కీల” అంటే స్థిరపరచడం లేదా గూళ్లనివ్వడం, “అద్రి” అంటే కొండ లేదా పర్వతం.

Read hindi news: hindi.vaartha.com

Read also: Local Body Elections: సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నేడు క్లారిటీ!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870