हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Latest Telugu News : Women’s rights : మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

Sudha
Latest Telugu News : Women’s rights : మహిళల హక్కుల పట్ల అవగాహన అవసరం

ఆధునిక సమాజంలో గృహ హింసలు, స్త్రీలపై అత్యా చారాలు, లైంగిక వేధింపులు నానాటికీ అధికం అవుతున్నాయి. అత్మనూన్యతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం కొనసాగుతూ ఉన్నాయి. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నంలో 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్య రాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసి, ప్రతి ఏడు నవంబరు 25న స్త్రీల హక్కుల (Women’s rights)పరిరక్షణ, స్త్రీ హింసావ్యతిరేక దినంగా పాటించాలని తీర్మానించింది. అనాది నుండి అబలలుగా ముద్ర వేయబడిన ఆడవారికి అడుగు వేస్తే ఆపద, గడియ గడియకో గండం, అనుక్షణం ఆందోళన, మహిళలపై అణచి వేతలు కొనసాగుతుండడం నిత్యకృత్యాలే అవుతున్నాయి. మహిళలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు (Women’s rights)కల్పించినా వాటిపై సరైన అవగాహన లేకపోవడం, కనీసం వాటి గురించి తెలి యకపోవడంతో అతివలు మరింత అన్యాయాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా ఆచరణలో సాధ్యం కానిపరిస్థితి. పుట్టక ముందే భ్రూణహత్యలు, పుట్టిన తర్వాత వివక్షలు, మగువలు జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. తమపై వివక్షను, వేధింపులను ఎదుర్కోవడానికి వారు ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలు సుకోవాల్సిన అవసరం ఉంది.

Read Also: http://Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు

Women's rights
Women’s rights

ప్రధాన సెక్షన్లు

అందులో భాగంగా భారతీయ శిక్ష స్మృతిలోని కొన్ని ప్రధాన సెక్షన్లు సెక్షన్ 100 ప్రకా రం ఆత్మరక్షణ కోసం, ఒక వ్యక్తి మీద దాడి చేస్తే సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్షపడదు. 166(బి) సెక్షన్ ప్రకా రం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సంబంధిత సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు. 228(ఏ) సెక్షన్ ద్వారా లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటో లు ప్రచురించ కూడదు. అలా చేసిన పక్షంలో సదరు సంస్థ పై చర్యలు తీసుకోవచ్చు. 354సెక్షన్ ప్రకారం స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమాన పర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు. 376 సెక్షన్ కింద మహిళల అనుమతి లేకుండా సెక్సులో పాల్గొంటే అది అత్యాచారంగా భావించి అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఒకవేళ మైనర్ బాలిక ఆమె ఇష్టప్రకారమే చేసినా పురుషుడికి పోస్కో చట్టం క్రింద సుమారు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. భార్య ఉండగా, మరో పెళ్లి చేసుకుంటే 494సెక్షన్ ప్రకారం అతని మీద కేసు నమోదు చేయవచ్చు. కేసు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్షపడుతుంది. 498(ఏ) సెక్షన్ ఓ వివాహితను ఆమె భర్తకానీ, భర్త బంధువులు కానీ అదనపు కట్నంకింద ధన, వస్తు, ఆభరణాలు అడిగితే ఈ సెక్షన్ ప్రకారం శిక్షార్హులు. గృహినులను శారీరకంగా, మానసికంగా, హింసించి నా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా గృహ హింసా చట్టం కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది. 509 సెక్షన్ మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకర వస్తువులను ప్రదర్శించినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు. ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ, శబ్దాలు చేస్తూ ఎవరైనా ఇబ్బంది పెడితే సెక్షన్ 294 ప్రకా రం వారిపై ఫిర్యాదు చేయవచ్చు. కనీసం మూడు నెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష, లేదా కొంత జరిమానా వేయ వచ్చు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మహిళను వెక్కిరించినా, అనుకరించినా, వారిపై సెక్షన్ 354(డీ) ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది.

Women's rights
Women’s rights

ఆఫీసు పనుల్లో

పనిచేసే ప్రదేశాల్లోతోటి ఉద్యోగులు గానీ, బాస్ గానీ ఆఫీసు పనుల్లో అలుసుగా తీసుకొని సెక్సువల్ కాంటాక్ట్
కోసం ఇబ్బంది పెడితే 2013 వేధిం పుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. ఒకరి ఫొటోను మార్ఫింగ్ చేసి వారి శరీరాలకు ముఖాన్ని అతికించి ఇబ్బం ది కరంగాఇంటర్నెట్లో షేర్ చేస్తున్న సంఘటనలలో సెక్షన్ 499 ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షపడవచ్చు. ఒక మహిళను దౌర్జన్యంగా, బలప్రయోగం వల్ల తన శరీరంపై ఉన్న దుస్తులను తీసివేసినా, ఆ వ్యక్తికి సెక్షన్ 354(బీ) ప్రకారం 3 నుండి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. 13/2013 సవరణల చట్టం ద్వారా ఈ సెక్షన్ అదనంగా చేర్చబడింది. ఒక మహిళ, విద్యార్థినికి సంబంధించిన రహస్య వ్యక్తిగత ఫొటోలు తీయడం, వీడి యోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా 354(సీ) సెక్షన్ కింద ఏడాదినుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడు తుంది. వ్యభిచారానికి, 18 ఏళ్లలోపు బాలికను కొనుగోలు చేసినా సెక్షన్ 373 ప్రకారం పదేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా విధిస్తారు. బాలికను వ్యభిచారానికి మా రేందుకు ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా సెక్షన్ 366(ఏ) కింద పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించబడుతుం ది. నిండు గర్భిణిని చంపాలనే ఉద్దేశంతో చేపట్టిన ఒకచర్య పర్యవసానంగా ఆమె చనిపోతే నేరస్థుడిపై సెక్షన్ 316 ప్రకా రం ప్రాణహరణం కింద, నేరం మోపబడుతుంది. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు మరణిస్తే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ఒక బృందంలోని సభ్యు లు ఒకమహిళపై లైంగిక దాడిచేసిన సందర్భాల్లోనూ వారి లో ప్రతివ్యక్తి నేరానికి పాల్పడినట్లే పరిగణించబడుతుంది. సెక్షన్ 376బీ కింద ప్రతి ఒక్కరికీ 20 ఏళ్లు తగ్గకుండా జీవితఖైదు శిక్షవిధిస్తారు. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ సవరించబడింది. స్త్రీ, బాలికను గానీ తన ఇష్టా నికి వ్యతిరేకంగా ఓ వ్యక్తిని వివాహం చేసుకునేందుకు బల వంతంగా అంగీకరించాలని ఒత్తిడి తేవడం, ఆస్త్రీని అపహ రిస్తే బలవంతంగా వివాహం చేసుకునే సెక్షన్ 366 కింద పదేళ్ల జైలు శిక్షతోపాటుజరిమానా పడుతుంది. ఇలాంటి చట్టాల ఎన్నో గురించి మహిళలు అవగాహన కలిగి ఉండా లి. అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్త్రీల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలి. సాటి మనుషులుగా మహిళలకు సామాజిక బాధ్యతగా సహకరించాలి.
– రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870