Sankranti traffic jam : సంక్రాంతి పండుగ నేపథ్యంలో Hyderabad నుంచి Vijayawada వైపు వెళ్లే ప్రయాణికులతో హైవేపై తీవ్ర వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు పెద్ద సంఖ్యలో తమ సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నుంచే ట్రాఫిక్ భారీగా పెరిగింది. శనివారం ఉదయానికి రద్దీ మరింత ఎక్కువైంది.
హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా Choutuppal, పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. యాదాద్రి–భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవాలని సూచించగా, గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్ హైవే మార్గాన్ని ఎంచుకోవాలని తెలిపారు. అయితే ఈ మార్గాల్లో కూడా వాహనాల రద్దీ కనిపిస్తోంది.
సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో బస్సు, రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొనగా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక ప్రాంతాలు సందడిగా మారాయి. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపిస్తోంది.
Read Also: Ankush Bharadwaj: షూటింగ్ కోచ్ పై లైంగిక వేధింపుల కేసు?
ఈ మార్గాల్లో ప్రయాణిస్తే…
హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వారు నార్కట్‌పల్లి వరకు వెళ్లి అక్కడి నుంచి అద్దంకి జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. విజయవాడ హైవే (Sankranti traffic jam) మీదుగా వెళ్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కొంత దూరం పెరిగినా హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవే మార్గం ప్రయాణానికి అనుకూలమని తెలిపారు.

ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుని నార్కట్‌పల్లి దాటితే ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. ఓఆర్‌ఆర్ ద్వారా వెళ్లేవారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని నాగార్జునసాగర్ హైవే చేరితే ప్రయాణం సాఫీగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
రెండు రోజులు తప్పని రద్దీ
శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ మొదలైంది. స్కూళ్లకు సెలవులు, శని–ఆదివారాలు ఉద్యోగులకు సెలవులు కావడంతో గ్రామాల వైపు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చని, ఆ తర్వాత పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: