వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి (Midhun Reddy) లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన కోర్టును ఆశ్రయించి జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం పిటిషన్ వేశారు. ఇంటి భోజనం, వ్యక్తిగత అటెండర్, వారానికి ఆరు ములాఖత్‌లు కల్పించాలనే అభ్యర్థనకు సంబంధించి కోర్టు విచారణ చేపట్టింది.
ఇంటి భోజనం, ములాఖత్‌లు కుదరని జైళ్లశాఖ స్పష్టీకరణ
విజయవాడలోని ఏసీబీ కోర్టుకు జైళ్లశాఖ నివేదిక సమర్పించింది. మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అందించడాన్ని అనుమతించలేమని స్పష్టంచేసింది. అదేవిధంగా, వ్యక్తిగత అటెండర్ సదుపాయం మరియు వారానికి ఆరు ములాఖత్‌లకు కూడా అనుమతి ఇవ్వలేమని తెలిపింది. జైలు నిబంధనల ప్రకారం అందరికీ సమానమైన నిబంధనలు వర్తిస్తాయని జైళ్లశాఖ స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలు – లాయర్లకు అవకాశం
జైళ్లశాఖ సమర్పించిన మెమోపై అభ్యంతరాలు తెలపాల్సిందిగా మిథున్ రెడ్డి లాయర్లను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో అభ్యర్థనలపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ అభ్యర్థనపై చర్చ జోరుగా సాగుతోంది.
Read Also : CM Revanth : రేవంత్ రెడ్డి అపరిచితుడు – కేటీఆర్