ఉత్తర తెలంగాణతో(North Telangana) పాటు దాని పరిసరాల్లోని విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి, ఉత్తర తెలంగాణ,(Telangana,) మధ్య విదర్భ ప్రాంతాల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు నాన్‌స్టాప్ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రానికి(Telangana State) ఈ రోజు వాతావరణ శాఖ(Department of Meteorology) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రాబోయే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు, పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ వర్షాలకు ప్రధాన కారణం ఏమిటి?
రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు?
వాతావరణ శాఖ ప్రస్తుత నివేదికలో తెలంగాణకు ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: