అంకెలు అభివృద్ధిని సూచి స్తాయా? అంచనాలు అభి వృద్ధికి సంకేతాలా? అనే మీ మాంస ప్రజల్లో కలగడం సహ జం. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటున్న అమెరికా లాంటి దేశాలే అనేక ఆర్థిక ఒడిదుడుకుల నుఎదుర్కొంటున్న విషయం తెలి సిందే. ఇతర దేశాల బలహీనతల ను ఆసరాగా చేసుకుని ఆయా దేశాల్లోని విలువైన ఖనిజ సంపద ను కొల్లగొట్టి, తన ఆర్థికవ్యవస్థను చక్కదిద్దుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. కొన్ని దేశాలు ఆర్థికంగా దివాలాతీసి, అప్పులతో నెట్టుకొస్తు న్నా వాటిని కూడా ఆర్థికంగా ఉన్నతమైన దేశాలుగా కొన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక అంచనా సంస్థలు పేర్కొనడం వర్తమానంలో జరుగుతున్న ఒక ప్రహసనంగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో అభివృద్ధికి, బలమైన ఆర్థిక వ్యవస్థ (financial system)కు నిజమైన నిర్వచనం అన్వేషించవలసిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. జర్మనీ, జపాన్ దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానంతరం వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. వినాశనం నుండి అభివృద్ధి సాధన దిశగా ఈ రెండు దేశాలు పరివర్తన చెంద డానికి ప్రధాన కారణం ఆయా దేశాలు అనుసరించిన ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక విధానాలేకారణం. ఎన్నో ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటున్నా నేటికీ అమెరికా డాలర్ విలువ పెరుగుతూనే ఉంది. ప్రపంచాన్ని డాలర్ శాసిస్తూనే ఉంది. 30.5 ట్రిలియన్ల డాలర్లతో అమెరికా ప్రపంచంలో అగ్ర ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతూనే ఉంది. చైనా 19.23 ట్రిలియన్ డాలర్లతో, జర్మనీ 4.74 ట్రిలియన్ల డాలర్లతో, జపాన్ 4.19 ట్రిలియన్ల డాలర్లతో బలమైన ఆర్థిక(financial system) వ్యవస్థ లను కలిగిఉన్నాయి.
Read Also: http://PM Modi: భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

నాల్గవ ఆర్థిక వ్యవస్థ
ఐ.ఎం.ఎఫ్ అంచనా ప్రకారం జపాన్ 4.186 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అధిగమించి స్వల్ప వ్యత్యాసంతో ఇండియా 4.187 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాల్గవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయే రెండు మూడేళ్లలో భారత్ జర్మనీని అధిగమించి మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. అయితే భారత్లో ప్రజల జీవన ప్రమాణాల స్థాయి ఆశించినంతగా పెరగలేదనే అంచనా లున్నాయి. జపాన్ జనాభా 12కోట్లు, జర్మనీ 8.5 కోట్లు. ఈ రెండు దేశాలు ఎన్నో దశాబ్దాల క్రిందటే అభివృద్ధిబాటలో కొనసాగుతున్నా యి. 140 కోట్ల జనాభా గల భారత దేశం జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలను అధిగమించడంలో ఆశ్చర్యంలేదు. ఎందు కంటే ఇవి భారత్తో పోల్చిచూస్తే జనాభా పరంగాను, భూ విస్తీర్ణంలోను చిన్నదేశాలు. అయినప్పటికీ ఈదేశాలుబలమైన పారిశ్రామిక దేశాలుగా ఎదిగాయి. భారత్ కంటే ఎన్నో రెట్లు భూవిస్తీర్ణం కలిగి, తక్కువ జనాభాతో అన్నిరంగాల్లో ముం దంజలో ఉండి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా ను ఢీకొట్టడం భారత్కు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు.బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే చైనా తో పోటీపడాలి. చైనా మాదిరి క్రమశిక్షణతో అన్ని రంగాల్లో స్వయం స్వావలంభన సాధించగలగాలి. అప్పులను తగ్గించు కోవాలి. ప్రజలపై భారం పడకుండా దేశంలోని అన్నిరాష్ట్రాలు తమ ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. అనవసరమైన ఉచిత పథకాలకు స్వస్తి చెప్పాలి. ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు
అంగీకారం తెలపాలి. అప్పుల భారం తగ్గించుకుని ఆర్థిక వృద్ధి రేటును పెంపొందించుకోవాలి. భారత దేశం అప్పు 192 శాతం పెరిగింది. గత పదేళ్లలో 62లక్షల కోట్ల నుండి 181లక్షల కోట్లకు అప్పు పెరిగిందని 2025 ప్రథమం లో పేర్కొన్నారు. 2026 నాటికి 196197 లక్షల కోట్లకు అప్పు చేరుతుందనే అంచనా ఉంది. అయితే కేంద్రం మాత్రం అప్పుల భారం తగ్గిందని, ఆర్థిక వ్యవస్థ పుంజు కుందని పేర్కొనడంలో గల ఔచిత్యం ఏమిటో తెలియదు. ఐ.ఎమ్.ఎఫ్ అంచనాల ప్రకారం భారత్ అప్పు 212 లక్షల కోట్లు ఉంటుందని భారతదేశ అవగతమవుతున్నది.
రూపాయి వెలవెల
భారత దేశ జి. డి.పిలో 83 శాతం అప్పులే ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే 2025నాటికి భారత్ అప్పు 200 లక్షల కోట్లు ఉంటుందని మరో అంచనాఉంది. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆనందం అప్పుల కారణంగా ఆవిరైపోతున్నది. డాలర్ విలువ పెరిగిపోతూ భారతీయ రూపాయి వెలవెలపోవడం ఆందోళన కలిగిస్తున్నది. భారతీ య రూపాయితో పోల్చితే అమెరికా డాలర్ 90రూపాయలు దాటడం దేనికి సంకేతం? భారతీ యుల ప్రస్తుత తలసరి ఆదాయం 2.4 లక్షలని అనధికార అంచనా. 2026 నాటికి భారతదేశ తలసరి జి.డి.పి 3200 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. భారత దేశంలో ప్రతీవ్యక్తి మీద అప్పుభారం 2026 నాటికి 1.4లక్షలు ఉండవచ్చని అంచనా. ప్రభుత్వ అప్పులతో కలిపి దీనిపరిమాణం 2.2లక్షలకు చేరవచ్చు. భారత్ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా అవతరించినా ట్రంప్ భారతన్ను డెడ్ ఎకానమీగా అభివర్ణించడంలో గల ఆంతర్య మేమిటి? భారత్ ఆర్థికవ్యవస్థ ముఖ చిత్రం ఎలా ఉంది అనే నిజంతెలియాలి. దేశంలో హైవేలు పెరిగాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్న మాట వాస్తవం. ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్కు రావడానికి ఎదురుచూస్తున్న సంగతిని కాదనలేము. ఒకప్పుడు భారత్ ను హేళన చేసిన దేశాలు ప్రస్తుతం భారత్ పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండడమేకాకుండా, భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య సంబం ధాల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవం. భారత్ జనాభా, యువత దేశానికివరం.
చావు దెబ్బ
అయితే ట్రంప్ భారత్పై అక్కసుతో విబేధాలు పెంచుకుంటున్నాడు. ప్రతీకార సుంకాలు పెంచు కుంటూపోతున్నాడు. రష్యాతో స్నేహం వద్దని భారత్ను హెచ్చరిస్తున్నాడు. అనేక రకాలుగా బెదిరిస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలతో బెదిరించి, భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ మాత్రం తన ధోరణి మార్చు కోకపోయినా, అమెరికా మాత్రం పార్కు వంతపాడుతూ, ఆదేశానికి సహా యం అందించడానికే పాధాన్యతనిస్తున్నది. ఇజ్రాయిల్ అరా చకత్వాన్ని అమెరికా ప్రోత్సహించింది. ఇరాన్ పై ప్రత్యక్ష దాడికి దిగింది. ఆ తర్వాత క్రమంలో ఇజ్రాయెల్ ఇరాక్లల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఉక్రెయిన్ను రెచ్చగొట్టి రష్యాపై ఇంతకాలం యుద్ధం కొనసాగించడానికి అమెరికా కారణమైనా, ప్రపంచ దేశాలు అమెరికాను నిందిం చడం లేదు. అమెరికాకు మిత్ర దేశంగా కొనసాగుతున్న భారత్ను ప్రస్తుతం ట్రంప్ శతృవులా చూస్తున్నాడు. డోనాల్డ్ ట్రంప్ చేష్టలను భారత్ ఖండించడంలేదు కదా కనీసం స్పందించ డం కూడాలేదు. ఇటీవల రష్యా అధ్యక్షుడుపుతిన్భారత్ను సందర్శించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర చుకోవడమే కాకుండా, ఆయుధ ఒప్పందాలను కూడా కుదు ర్చుకోవడం కూడా జరిగింది. యథాశక్తి అమెరికా తన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంది. అయినా భారత్కు రష్యాతో గల చిరకాల స్నేహాన్ని భారత్వి డనాడలేదు. ట్రంప్ టారిఫ్ యుద్ధాన్ని తట్టుకుంటూనే, అమెరికాకు ఎదురు చెప్పకుం డానే, భారత్ నొప్పించక తానొవ్వక… అనే రీతిలో తన వ్యూహాన్ని నిశ్శబ్ధంగా అమలు పరచుకుంటూపోతున్నది. భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, అభివృద్ధి సాధిస్తున్నా, సాధించిన అభివృద్ధి ఫలాలు మధ్యతరగ తికి అందడం లేదనే భావన వ్యాపించింది. కార్పొరేట్లు మరింత కుబేరులుగా మారుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొన్నది.

నేటికీ పేదరికం
భారత్లో నేటికీ పేదరికం కొనసాగుతూనేఉంది. ప్రజలు ఆర్థికంగా బలోపేతమైతేనే నిజమైన అభివృద్ధిసాధిం చినట్టుగా భావించాలి. అభివృద్ధికి అర్థవంతమైన నిర్వచనం కావాలి. ప్రజలందరూ జీవించడానికి కనీసమౌలిక సదుపా యాలు కావాలి. పరిశుభ్రమైన త్రాగు నీరు, వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. రైల్వే, రోడ్డు, సదుపాయాలు మరింతగా మెరుగుపడాలి. గ్రామీణ ప్రాంతా ల్లో నేటికీ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రజలందరికీ ఉచిత విద్య అందించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆకలితో తనువు చాలించే పరిస్థితులు మారాలి. ఉచిత పథకాల వలన ప్రజలపై మోయలేని పన్నుల భారంపడతుండడం సముచి తంకాదు. గతంలో పోల్చిచూస్తే భారత్లోఉపాధి అవకాశాలు పెరిగిన మాట వాస్తవం. సర్వీసు రంగం, తయారీ రంగం పుంజుకున్న మాటయథార్ధం. అయితే నేటికీ భారత్ను అభి వృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నారే తప్ప అభివృద్ధి చెందిన దేశంగా భావించడం లేదెందుకు? ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని భారత్ తన ఆర్ధికపంథాను నిర్ణయించుకో వాలి. దేశంలోని సహజ సంపదను, యువశక్తిని సద్వినియోగం చేసుకుని ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదగాలి.
-సుంకవల్లి సత్తిరాజు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: