విజయవాడ Vijayavada :ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పుచేర్పులకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈక్రాప్ E-Crop తుది జాబితాను ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు వివరించారు. గతంలో ఈక్రాప్ నమోదుకు వెళ్తే సాంకేతిక సమస్య వల్ల నమోదు చేయలేదని, ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రభుత్వం గడువు పెంచినందుకు తమకు మంచి జరుగుతుందని రైతులు చెబుతున్నారు. రైతులు పండించిన పంటల సేకరణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఈక్రాప్ ను ప్రామాణికంగా తీసుకుంటోంది. పంటల సాగు ప్రారంభమై రెండు నెలలు దాటినా కూడా కృష్ణా జిల్లాలో ఈక్రాప్ నమోదు అనుకున్న స్థాయిలో జరగడం లేదని రైతులు చెబుతున్నారు.
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ

E-Crop 2025
ఈ ఖరీఫ్ kharif సీజన్ ప్రారంభంలో వ్యవసాయశాఖ సహాయకుల బదిలీలు రైతులకు శాపంగా మారాయి. ప్రభుత్వం తొలుత సెప్టెంబర్ నెలాఖరుకు గడువు తేదీని నిర్దేశించింది. జిల్లాలో ఈక్రాప్ నమోదులో ఇబ్బందులు తలెత్తడం వల్ల పంట నమోదు ముందుకు సాగలేదు. ప్రారంభం నుంచి కూడా పంట నమోదు ప్రక్రియ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నమోదుకు రైతు సేవా కేంద్రాల చుట్టూ అన్నదాతలు ప్రదక్షణలు చేస్తున్నారు. రైతులు క్షేత్రస్థాయిలో సాగు చేసిన పంటలను పరిశీలించి వాటి వివరాలను వీవీఏలు ఈక్రాప్ నమోదు చేయాల్సి ఉంది. ఈ సీజన్ ప్రారంభంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 475 మంది వీవీఏలను బదిలీ చేశారు. జిల్లాలో 3,55,824 హెక్టార్లలో రైతులు ఖరీఫ్ ను సాగు చేస్తున్నారు. ఈసారి ఈకేవైసీని నోటిఫైడ్ పంటలకు మాత్రమే పరిమితం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వ్యవసాయ, ఉద్యాన, పట్టు, సామాజిక అడవులు, సాగు చేయని బీడు భూములను ఈపంటలో నమోదు చేయాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగులు బదిలీ కావడం, కొత్త ప్రాంతాల్లో సిబ్బంది భూ సర్వే నంబర్లు గుర్తించలేకపోవడం, గత రెండు నెలలు అధికారులు యూరియా సరఫరాపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం, సాంకేతిక సమస్యలు వంటి కారణాలతో ఈక్రాప్ నమోదులో ఇబ్బందులు తలెత్తాయని రైతులు చెబుతున్నారు. పంట నమోదులో జాప్యం జరిగి తాము పంటను ఈ క్రాప్ చేయించుకోలేకపోతే తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని గతంలో జరిగిన ఘటనలను గుర్తుకు తెచ్చుకుని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృత్తి విపత్తులు సంభవించిన సమయంలో తాము పెట్టిన పెట్టుబడి గంగలో కలిసిపోతుందన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ-క్రాప్ నమోదు గడువు ఎంతవరకు పొడిగించారు?
ఈ నెల 25వ తేదీ వరకు ఈ-క్రాప్ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది.
సామాజిక తనిఖీలు మరియు సవరింపులకు గడువు ఎప్పటివరకు ఉంది?
సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పులకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: