ఇంద్రకీలాద్రి (Vijayawada): దుర్గమ్మకు (Durgamma) పలువురు భక్తబృందాల వారు గురువారం ఆషాడం సారెను సమర్పించారు. మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ పలు ప్రాంతాలకు చెందిన బృందాలు తమ ఇంటి ఆడపడుచుగా భావించి దుర్గమ్మవారికి సారె సమర్పించారు. ఆషాడం సారె సమర్పించిన భక్తుల బృందాలకు దుర్గమ్మ (Durgamma) వారి దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు అన్నప్రసాదాలు అందించారు. శుక్రవారం నాడు గురుపూర్ణిమ సందర్భంగా పెద్ద ఎత్తున దుర్గమ్మవారి దర్శనానికి భక్తులు వచ్చే అవకాశమున్నందున అంతరాలయ, విఐపి దర్శనాల రద్దు యోచన చేస్తున్నట్లు ఇఓ తెలిపారు. శాకంబరి ఉత్సవాల ముగింపు ఈనెల 10 న జరిగే వరకు ఈ రద్దీ వుంటుందని భావిస్తున్నామన్నారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి (Sri Durga Malleshwara Swamy) వార్ల దేవస్థానం నిర్వహిస్తున్న పోరంకిలోని వేదపాఠశాలను ఇఓ వికె శీనా నాయక్ (VK Sheena Nayak) గురువారం పరిశీలించారు. గతనెలలో తాను చేసిన పరిశీలన సందర్భంగా చెప్పిన పనుల స్థితి గురించి విచారించారు. మరుగుదొడ్లు రిపేర్, ఆర్వోప్లాంట్, కిటీకీల రిపేర్లు పూర్తయ్యాయయని ఉపాధ్యాయులు ఇఓకు తెలిపారు. విద్యార్థులకు ఆటమైదానంలో కలుపు మొక్కలు తొలగింపు, బిల్డింగ్ స్లాబ్ రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని ఇఓ ఆదేశించారు. కార్యక్రమంలో వేదపాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వేదపండితులు, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. దుర్గమ్మవారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి మాజీ మంత్రి సిద్దా రాఘవరావు గురువారం రు1లక్ష 1వెయ్యిలను విరాళంగా ఈఓకు అందించారు. శిద్దారాఘవరావు దంపతులకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అనంతరం వారికి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటో అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Anita: స్వర్ణాంధ్ర 2047 లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిత