Drug Bust Nellore: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తీసుకుంటున్న పటిష్టమైన చర్యల్లో భాగంగా బుధవారం వేదాయపాలెం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి విక్రయానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలను నగర ఏఎస్పి దీక్ష బుధవారం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Read Also: Nellore crime news: అన్నదమ్ములపై దాడి.. ఏడుగురు అరెస్ట్
ఆమె తెలిపిన సమాచారం మేరకు.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో గంజాయి విక్రయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా స్థానిక వైయస్సార్ నగర్ లోని ఓ ఇంటిపై వేదయపాలెం సిఐ కె శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఆ ఇంట్లో అప్పటికే విక్రయాలకు గంజాయిని ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసి ఉన్న ముగ్గురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

వైయస్సార్ నగర్ కు చెందిన ఆరవ ఓంరేష్, సయ్యద్ లియాకత్ అలీ, కపాడిపాలెంకు చెందిన ఊట్ల జాన్ వెస్లీ లు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వారి వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన 6.600 కిలోల గంజాయిని గుర్తించి, తహసిల్దార్ సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుల హాజరు పరుస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ ఘనపరిచిన స్థానిక సీఐ కే శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జిలాని, కానిస్టేబుల్ రాజు కిషోర్, వెంకట్ రామ్, శ్రీనివాసులు, గురు మహేష్, నాగరాజులను ఏఎస్పి అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: