అనంతపురం: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని రాష్ట్ర బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత(S.Savitha) పేర్కొన్నారు. పుట్టపర్తి(Puttaparti) మండలంలోని పెడపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో కలిసి మంత్రి సవితా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తన వేరుశనగ కాయలను ప్రభుత్వ సబ్సిడీతో రైతులకు అందిస్తోందని తెలిపారు. ఇది రైతు మేలు కోరే మంచి ప్రభుత్వమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూన్ 21 నుంచి అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద 7000 కేంద్రం ఇచ్చే 2000 కలిపి మొత్తం రూ.9000 డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పోలవరం రాజధాని నిర్మాణంతోపాటు ప్రతి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

కూటమి ప్రభుత్వాన్ని రైతు సంక్షేమ ప్రభుత్వం
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని రైతు సంక్షేమ ప్రభుత్వంగా అభివర్ణించారు. గత వైసిపి పాలనలో రైతు సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్పు, స్ప్రింకర్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 నుంచి 19 వరకు అప్పటి టిడిపి ప్రభుత్వం హయాంలో సుమారు 1400 కోట్లు రైతులు వ్యవసాయ పరికరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రైతాంగం సమస్యలపై తక్షణం స్పందించి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని తెలిపారు.
వ్యవసాయంలో కూడా డ్రోన్ టెక్నాలజీ
వ్యవసాయంలో కూడా డ్రోన్ టెక్నాలజీతో రైతులకు ఖర్చు తగ్గించి ఆదాయాన్ని చేకూర్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓటమి ప్రభుత్వం రైతుల ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నూతన టెక్నాలజీని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. జిల్లాలో 14 వేల ఎకరాల్లో పంటలు చేసుకున్న రైతులు వ్యవసాయ పరికరాలు డ్రిప్ ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో సుమారు 12 ఎకరాలల్లో డ్రిప్పు పథకం ఉంది. స్ప్రింకర్లను ప్రభుత్వం అందించిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది మంచి ప్రభుత్వమని రైతు సంక్షేమ ప్రభుత్వం అని అభివర్ణించారు. రైతులు ఈ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని ప్రభుత్వం అందించే వ్యవసాయ రాయితీ పథకాలను సద్వినియం చేసుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరారు. అనంతరం రైతులకు విత్తన వేరుశనక్కాయల బస్తాలను మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
Read Also: Flight Service : ఈ నెల 13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సర్వీస్