సైబర్ నేరాలు రూపాంతరం చెంది డిజిటల్ అరెస్ట్ పేరుతో దోపిడీలు తారాస్థాయికి చేరాయి. ఎంతగా అంటే ఉన్నతవిద్యావం తులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతి నిధులు, చివరికి బ్యాంకు అధికారులు సైతం వారి వలలో పడి డబ్బులు కోల్పోయి విలవిలాడుతున్నారు. నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మానసికంగా బెదిరిస్తూ బురిడీ కొడుతున్నారు. ఈ విధంగా డిజిటల్ అరెస్టులు ఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ప్రజాచైతన్యం, అవ గాహన పెరగాలి. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్స్ లో అరెస్టులు చేయరని, డబ్బులు బదిలీ చేయమని బెదిరించ రని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఎప్పటి కప్పుడు అప్రమత్తం గా ఉండటం అత్యవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్నేరాలపై (Digital fraud)ఉక్కు పాదం మోపాలి. అప్రమత్తతే ప్రజా ఆయు ధం. మన దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టుల మోసాల (Digital fraud)తీవ్రత పరిశీలిస్తే ఆధునిక టెక్నాలజీ మూలంగా డిజిటల్ యుగం మన జీవితంలో సౌలభ్యాన్ని తెచ్చింది. కానీ అదే సాంకేతికత ఇప్పుడు మోసాలకు, ఆర్థిక నష్టాలకు కారణమవుతోంది. వాస్తవంగా ఆధునిక టెక్నాలజీ సామాన్యుడి ప్రగతికి, జీవన విధానం మెరుగుదలకు తోడ్ప డితేనే దానికి సార్ధకత. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా టెక్నాల జీని వాడుకొంటూ నేరాలకు పాల్పడుతున్నారు. అలా సైబర్ నేరాల కొత్త రూపమే డిజిటల్ అరెస్టులు. మనసులనూ, మనీని కూడా కబళిస్తోంది. ఇలాంటి మోసాల నుంచి మనం రక్షించుకునే ఆయుధం ఒక్కటే అప్రమత్తత.
Read Also : Jobs:త్వరలో 2,837 కంప్యూటర్ టీచర్ ఉద్యోగాలు!

భయపెట్టే ముఠాలు
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు భయానకర స్థాయికి చేరాయి. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఖాకీ బట్టలు వేసుకొని వీడియో కాల్స్ చేస్తూ, మీరు ఉగ్రవాదులతో సంబంధం కలిగారు, మాదకద్రవ్యాల కేసులో పేరు వచ్చింది. మనీలాండరింగ్లో పాలుపంచుకున్నారు అంటూ భయపెట్టే ముఠాలు పౌరులు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టులకు డిజిటల్ అరెస్టు లపై 2022లో డిజిటల్ అరెస్ట్ మోసాలపై39,925 ఫిర్యాదులు నమోదైతే, 2024లో అలాంటివి 1.23 లక్షలకు పెరిగాయి. బాధితులు కోల్పోయిన సొమ్ము విలువ రెండు సంవత్సరాల్లో 21 రెట్లు పెరిగింది. ఈ ఏడాది మొదటి రెండు నెల ల్లోనే 17,718 కేసులు నమోదవడం చూస్తుంటే, నేరగాళ్లు ఎంతగా చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్యావంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బ్యాంక్ అధికారులు కూడా ఈ వలలో చిక్కుతున్నారు. నకిలీ గుర్తింపులు, ఫోర్జరీ పత్రాలు, వాయిస్క్లోనింగ్, సాంకేతిక నైపుణ్యంతో ఈ ముఠాలు నేరాలను కొత్త రూపంలో తీవ్ర స్థాయికి తీసుకెళ్తున్నాయి. బాధితులు ఆర్థిక నష్టంతో పాటు మానసికంగా కూడా కృంగిపోతున్నారు. ప్రత్యేకించి పెన్షనర్లు పెద్దగా ప్రభావితమవుతున్నారు. లైఫ్ సర్టిఫికెట్, పింఛన్ వెరిఫికేషన్ పేరిట వివరాలు సేకరించి మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీ అవగాహన తక్కువగా ఉండటంతో వారు సులభంగా వలలో పడుతున్నారు. ఈ డిజిటల్ మోసాలపై ప్రధాన ఆయుధం అప్రమత్తత.

మనజాగ్రత్తే చివరి రక్షక కవచం
ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు ముగ్గురి సమన్వయం ద్వారానే మూలాలు గుర్తించి దీన్ని సమూలంగా అరికట్టవచ్చు. టీవీ, రేడియో, సోషల్ మీడియా ద్వారా డిజిటల్ అరెస్టులు చట్టంలో లేవు అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్, వీడియో కాల్స్, ఓటిపిలు, ఆధార్ వివరాలు పంచకూడదు. బ్యాంకులు, ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంకులు తమ వినియోగదారులకు కాలానుగుణంగా సైబర్ సేఫ్టీ అలర్ట్స్ పంపాలి. ప్రభుత్వ సంస్థలు ప్రజా స్థాయిలో సైబర్ అవగా హన శిబిరాలు నిర్వహించాలి. సైబర్ మోసగాళ్లపై కఠిన మైన శిక్షలు విధిస్తూ, వారి ఆర్థిక లావాదేవీలను తక్షణం ఫ్రీజ్ చేసే చట్టపరమైన విధానాలు రూపొందించాలి. సిబిఐ, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు కలిసి విభిన్న రాష్ట్రాల్లో జరి గిన కేసులను సమగ్రంగా దర్యాప్తు చేయాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మోసానికి గురైన వెంటనే డయల్ 1930 లేదా 100 కు సమాచారం ఇవ్వాలి. గుర్తు తెలియని లింకులు క్లిక్ చేయకూడదు. వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా వచ్చిన తిశిరీ ఫైళ్లను తెరవకూడదు. సాంకేతిక సదుపాయా లు ఎంత పెరిగినా,మనజాగ్రత్తే చివరి రక్షక కవచం. డిజిటల్ అప్రమత్తత అనే ఈ సంస్కృతి ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. సైబర్ నేరాలు యుద్ధం మాదిరిగా మారుతున్నాయి. కానీ ఆయుధం అవసరం లేదు. అవగాహన, అప్రమత్తత, ధైర్యం చాలు. ప్రజలు తమ వ్యక్తిగత సమా చారం కాపాడుకుంటే, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తే, ఈ మోసాలు ముగుస్తాయి. డిజిటల్ మోసాలపై అప్రమత్తతే అసలైన రక్షణ.
-మెకిరి దామోదర్
భారతదేశంలో ఆన్లైన్ మోసం శిక్షలు?
సెక్షన్ 447లో పేర్కొన్న విధంగా మోసాలకు గరిష్ట శిక్ష ఆరు నెలల కంటే తక్కువ కాకుండా పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు మోసంలో పాల్గొన్న మొత్తం కంటే తక్కువ కాకుండా మోసంలో పాల్గొన్న మొత్తానికి మూడు రెట్లు వరకు జరిమానా విధించవచ్చు.
ఏ రాష్ట్రం నెంబర్ 1 సైబర్ క్రైమ్?
తెలంగాణాలో అత్యధిక సైబర్ నేరాల రేటు 40.3 శాతం ఉంది – ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగే 4.8 రేటు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: