దొర మరణంతో గ్రామంలో విషాదఛాయలు
DGP HJ Dora: హైదరాబాద్లో కన్నుమూసిన హెచ్ జె దొర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో డి.జి.పిగా పని చేశారు. అనంతరం కేంద్ర విజిలెన్స్ కమిషనర్, సి.ఐ.ఎస్.ఎఫ్ మాజీ డీ.జీగా పని చేశారు. ఈయన 1943లో శ్రీకాకుళం జిల్లా జడ్డంగి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య జర్జంగిలో, ఉన్నత విద్య ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో జరిగింది. అనంతరం అఖిల భారత సర్వీస్ అయిన ఐ.పీ. ఎస్కు ఎంపికయ్యారు. ఈయన వివిధ హోదాలలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేసి డి.జి.పి స్థాయిని చేరుకుని ఉద్యోగ విరమణ పొందారు. ఈయన తండ్రి సత్యనారాయణ దొర 1952 సంవత్సరం నరసన్నపేట శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలోనే కోట బొమ్మాళికి ఉన్నత పాఠశాల తీసుకువచ్చారు. హెచ్.జే. దొర అత్తవారు నందిగామ మండలం, వెంకన్నపేట గ్రామం కాగా, ఈయనకు భార్య మీనాక్షి, కుమారుడు సత్యనారాయణ (సాఫ్ట్వేర్ ఇంజనీర్), కుమార్తె సాయి లీల బాబా ఆలయం (లండన్ లో వైద్య వృత్తి) ఉన్నారు. ఈయన సోదరుడు హెచ్.ఎల్.ఎన్. దొర విశాఖపట్నంలో కమర్షియల్ టాక్స్ ఎడిషనల్ కమిషనర్గా పని చేశారు.
Read Also: Ram Mohan Naidu: పలాస కేంద్రీయ విద్యాలయలో తరగతులు షురూ!

గ్రామాభివృద్ధికి చేసిన సేవలు
దొర గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామ ప్రజలకు ఉచితంగా శుభకార్యాలు చేసుకునేందుకు గాను కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టారు. అలాగే ఒక శివాలయం, ఒక నిర్మాణం చేపట్టారు. తన స్వగృహాన్ని ఉచితంగా వృత్తి విద్య కోర్సులు నిర్వహణకు జి.ఎం.ఆర్ సంస్థకు అప్ప గించారు. గ్రామానికి ఉన్నత పాఠశాల తీసుకురావడంతో పాటు, ప్రతి ఏడాది ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు. ఉపాధ్యాయులకు దుస్తులు పంపిణీ చేపడుతూ వస్తున్నారు. దొర అంత్య క్రియలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్ తన స్వగృహము నందు నిర్వహించనున్నట్లు వారి బంధు వర్గాలు తెలిపాయి. దొర మృతి వార్త విన్న జర్జంగి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1965 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన అయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిజిపిగా, సి.ఐ.ఎస్.ఎఫ్ డైరక్టర్ జనరల్, ఎపిఎస్ ఆర్టీసీ ఎం.డిగా, ఇంటలిజెన్స్ అధికారిగా, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా ఇలా పలు హోదాలలో పనిచేసి మెరుగైన పనితీరు కనబరిచారు. పదవి విరమణ అనంతరం 2006లో జీఎమ్మార్ సంస్థలో డిల్లీ ఎయిర్ఫోర్ట్ సెక్యురిటీ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా పని చేసిన అవిశ్రాంతంగా సేవలందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి అయిన హెచ్.జె.దొర నా తండ్రి ఎర్రన్నాయుడు తో అనుబంధంగా ఉండే వారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: