ఆంధ్రప్రదేశ్ లో 2025 సంవత్సరంలో నేరాల రేటు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) వెల్లడించారు. సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, మత్తు పదార్థాల రవాణా నియంత్రణ ప్రధాన సవాళ్లుగా మారాయని, సైబర్ మోసాల్లో డబ్బు రికవరీ కష్టమని, ప్రజల్లో అవగాహన పెరగాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) సూచించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్, గంజాయి రవాణాను అరికట్టడంపై దృష్టి సారించామని, మహిళల భద్రతలోనూ పురోగతి సాధించామని చెప్పారు. వచ్చే పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉండాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Read Also: AP: రైలు ప్రమాద ఘటన.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి
నకలైట్ల కార్యకలాపాలపై దృష్టి పెట్టామని డీజీపీ తెలిపారు. ఇటీవల కీలక వ్యక్తులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని.. అనేక మందిని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పేకాట క్లబ్‌లు నిర్వహించడం నేరమని..చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని జూదాలు నిర్వహించకూడదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలనే లక్ష్యంతోనే పోలీసులు పని చేస్తున్నారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: