వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) సవాల్ విసిరారు. “దమ్ముంటే అమరావతిలో పర్యటించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూసి ప్రజలకు నిజం చెప్పండి” అని ఆయన వ్యాఖ్యానించారు.
మీడియా సమావేశంలో వ్యాఖ్యలు
సోమవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవినేని (Devineni Uma) ఉమ మాట్లాడుతూ, “అక్రమాలు చేసి జైలుయాత్రలు చేయడం మానేసి, ఒకసారి రాజధాని ప్రాంతానికి రండి” అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

“అమరావతి మునగలేదు” – దేవినేని ఉమ
అమరావతి లోని సీడ్ యాక్సెస్ రోడ్డు, సచివాలయం, వీఎస్‌ఆర్‌ఎం, విట్ యూనివర్సిటీ వంటి ప్రాంతాలను స్వయంగా వచ్చి చూడాలని జగన్ (Jagan) ను సవాల్ చేశారు. “అమరావతి ఎక్కడా మునిగిపోలేదని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరోపణలు
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ఆదరణ చూసి, ఓర్చుకోలేక జగన్ అమరావతి (Amaravati) అభివృద్ధిపై విషప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు.
జగన్ మానసిక స్థితి ప్రశ్నార్థకమని వ్యాఖ్య
“జగన్ మానసిక పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని సహించలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు” అని దేవినేని మండిపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: