సచివాలయం పక్కన మైదానంలో జరిపేందుకు ఏర్పాట్లు
అధికారులతో సమీక్ష జరిపిన సిఎస్ విజయానంద్
విజయవాడ : ఆగస్టు 15వ తేదీన,నిర్వహించనున్న 79వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఈసారి రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (K. Vijayanand) వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఇటీవల పి4, ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకులు నిర్వహించిన ప్రాంతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని కావున అందుకు అనుగుణంగా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాజధాని నడిబొడ్డు ప్రాంగణంలో తొలిసారిగా రాష్ట్ర వేడుకైన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మరీ ముఖ్యంగా బహిరంగ ప్రాంతంలోను వర్షాకాలంలోను నిర్వహించనున్నందున ఈకార్యక్రమం విజయవంతానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజాయనంద్ అధికారులకు స్పష్టం చేశారు.
నిర్వహించిన ప్రాంతంలో
రానున్న స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో పటిష్టంగా చేపట్టాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలమైనందున వేడుకల నిర్వహణకు తగిన రీతిలో ప్రాంగణమంతా లెవెలింగ్ చేయడంతో పాటు ప్రధాన వేదిక తోపాటు, ఇతర సీటింగ్ ఏర్పాట్లు వద్ద జర్మన్ టెంట్లు వేయించాని, వాహనాల పార్కింగ్ (Vehicle parking) కు తగిన ఏర్పాట్లు చేయాలని సిఆర్డిఎ కమిషనర్ కన్నబాబును ఆదేశించారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు డిజిపి మదుసూదన్ రెడ్డిని ఆదేశించారు.అదే విధంగా ఆహ్వాన పత్రికలు పంపిణీ, ప్రోటోకాల్ సంబందిత అంశాలపై ప్రత్యేక చర్యలుతీసుకోవాలని గుంటూరుజిల్లా కలక్టర్ నాగలక్ష్మిని ఆదేశిం చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాజ్ భవన్, సిఎం క్యాంపు కార్యాలయం, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు సహా ఇతర చారిత్రక భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని సిఆర్డిఎ, ఆర్అండ్ బి, ఎపి ట్రాన్సుకో అధికారులను ఆదేశించారు.

వివిధ ప్రసార మాద్యమాల ద్వారా
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖల కార్యక్రమాలు, పథకాలపై ప్రత్యేక శకటాల ప్రదర్శన(టాబ్లూస్) ఏర్పాటకు చర్యలు తీసుకోవాలని సమచారశాఖ అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. అంతేగాక అభివృద్ధి సంక్షేమ పధకాల అమలుపై ముఖ్య అతిధి సందేశం, వివిధ ప్రసార మాద్యమాల ద్వారా వేడులపై లైవ్ కవరేజి తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలన చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి వివిధ శాఖలవారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) ద్వారా వివరించారు. ఆగస్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య్ర వేడుకల మినిట్ టు మినిట్ కార్యక్రమం గురించి వివరిస్తూ ఆరోజు ఉదయం 8.30 గం.లకు స్వాతంత్య్ర దినోత్సవ పేరేడ్ ప్రారంభం అవుతుందని 8.58గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక వద్దకు చేరుకుంటారని ఉ.10.30 గం.ల వరకూ ఈవేడుకులు నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.
CS విజయానంద్ అంటే ఎవరు?
CS విజయానంద్ అంటే కె. విజయానంద్ (K. Vijayanand) గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (Chief Secretary)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
విజయానంద్ గారు గతంలో మరే పదవుల్లో ఉన్నారు?
విజయానంద్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. ఆయనకి పాలనలో విశేష అనుభవం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Ponguru Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్ : మంత్రి నారాయణ