అనంతపురం (Anantapur) లోని శిశుగృహంలో ఘోరం జరిగింది. ఆరురోజులుగా తమ డ్యూటీల గొడవల్లో మునిగిపోయిన ఆయాలు పసిబిడ్డ ఆకలి కేకలను పట్టించుకోలేదు. దీంతో అనారోగ్యానికి గురైన ఆ చిన్నారి, ఉలుకు పలుకు లేకుండా అయిపోయింది.
ఈ స్థితిని గమనించిన ఆయా హుటాహుటిగా ఆ పసిబిడ్డను అర్థరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు పరీక్షించి, బిడ్డ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?

విరేచనాలతో మృతి నాటకాలు
ఐసీడీఎస్ పీడి (ICDS PD) కి సెంటర్ మేనేజర్ చిన్నారి విరేచనాలతో (diarrhoea) మరణించినట్లుగా ఓ కట్టుకథ అల్లి ఫైల్ను పంపించారు.అయితే బిడ్డను ఖననం చేస్తున్న సమయంలో పసిబిడ్డ మరణించకముందు తీసిన ఫొటోలు, మరణించిన తర్వాత తీసిన ఫొటోలు ఒకేలా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో ఈ బండారం బైటపడింది.
దీంతో చిన్నారి విరేచనాలతో మరణించడం ఓ కట్టుకథ అని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి ఆకలితో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. ఆయాలు తమ డ్యూటీని సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే బిడ్డ మరణించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ మరణంపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని బంధువు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: