దేశాన్ని, ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్యలో స్వల్పంగా అయినా పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్యాధికారులు, ప్రజారోగ్యశాఖలు అప్రమత్తమవుతూ కీలక సూచనలు చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. తెలంగాణలో తాజాగా తొలి కొవిడ్ కేసు నమోదైంది. కూకట్ పల్లి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడుకి కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్యు డు ఆదివారం నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయనకు RTPCR పరీక్ష చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలోనూ తొలి కేసు నమోదవ్వడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ బాధితుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే 25 పడకల వార్డును సిద్ధం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా కొంతమందిలో లక్షణాలు కనిపిస్తున్నాయని గాంధీ ఆసుపత్రి డా.సునీల్ చెబుతున్నారు. ఎవరికైనా సింటమ్స్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ మహిళకు కరోనా పాజిటవ్‌గా నిర్దారణైంది. ఆమె కుటుంబం వుంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్‌చేశారు. మరోవైపు కడప రిమ్స్‌లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని సూపరింటెండెంట్ ప్రకటించారు. జలుబు, జ్వరం ఉండడంతో ముందు జాగ్రత్తగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా ఉన్నట్టు నిర్దారణ కాలేదన్నారు డీఎం అండ్ హచ్‌వో. అసలు టెస్ట్ చేయలేదు, చేయడానికి కిట్స్‌లేవని తెలిపారు.
ప్రభుత్వ స్పందన & అప్రమత్త చర్యలు
గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే 25 పడకల ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒకే ఒక పాజిటివ్ కేసు నమోదైందని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై మంగళగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోండి
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు వైద్యులు. కొన్ని సూచనలు చేశారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రస్తుత కరోనా వేరియంట్ గురించి డాక్టర్లు చెబుతున్న ప్రకారం, ఇది పూర్వపు డెల్టా లేదా ఓమిక్రాన్ వేరియంట్లా తీవ్రత కలిగినది కాదు. ఇది ఎక్కువగా సీజనల్ ఫ్లూ లాంటి లక్షణాలతోనే వ్యక్తమవుతుంది. కానీ, వృద్ధులు, గర్భవతులు, నాన్-వాక్సినేటెడ్ వ్యక్తులు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Read also: Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత!