విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా మారుతోంది. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం, అధికారుల సమన్వయంతో భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.గంటా మాట్లాడుతూ, “నిత్యం యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి” అన్నారు. యువత, వృద్ధులందరూ యోగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ చారిత్రక ఘట్టానికి విశాఖ వేదిక కావడం గర్వకారణమన్నారు.ఈ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొనబోతున్నారు. వారి రవాణాకు సచివాలయాన్ని యూనిట్‌గా చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. సజావుగా కార్యక్రమం జరిగేందుకు అధికారులు పూర్తిగా సన్నద్ధమవుతున్నారు.
జగన్‌కు ఎమ్మెల్యే గంటా సవాల్
ఈ సందర్భంలో జగన్‌ను ఎమ్మెల్యే శ్రీనివాసరావు సవాల్ Ganta Srinivasa Rao తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల హామీలపై ధైర్యం ఉంటే చర్చకు రావాలి అన్నారు. తమ కూటమి ఇప్పటికే 80 శాతం హామీలు నెరవేర్చిందని చెప్పారు.గంగమ్మ జాతర డైలాగులు కొడితే జగన్ పార్టీ కుదేలవుతుంది అన్నారు. వైసీపీ ఇప్పుడు మునిగిన పడవగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్ Jagan వ్యవహార శైలి మారలేదని మండిపడ్డారు.
ఋషికొండ భవనాలపై త్వరలో నిర్ణయం
ఋషికొండ భవనాలపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే అహ్మదాబాద్ విమాన ప్రమాదం వల్ల కూటమి విజయోత్సవాలు వాయిదా పడ్డాయని తెలిపారు. ఇవి ఈ నెల 23న నిర్వహిస్తామని చెప్పారు.యోగా వేడుకలు విజయవంతం కావాలంటే అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. విశాఖను ప్రపంచ పటమపై నిలబెట్టే అవకాసం ఇది అన్నారు.
Read Also : YS Jagan: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై జగన్ స్పందన