ఫ్రీగా వస్తే పినాయిల్ అయినా తాగేస్తారనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఓ డీసీఎం లారీ
కొబ్బరి బోండాల (coconut shells) తో వెళ్తున్నది. హఠాత్తుగా రోడ్డుపై బోల్తాకొట్టింది. ఇంకేం ఉంది. సమీపంలోనిప్రజలు అందినకాడికి సంచులలో బోండాలను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బోల్తాకొట్టి డీసీఎం లారీ
ఏలూరు (Elur) నుంచి హైదరాబాద్ వెళ్తున్న కొబ్బరి బోండాల డీసీఎం వాహనం (Coconut Bondala DCM vehicle) సూర్యాపేట, రాయినిగూడెం వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలు అయ్యాయి. ఇంతో అతనినిఆసుపత్రికి తరలించారు. ఇంకేం ఉంది, లారీ వద్ద ఎవరూ లేకపోవడం, వాహనం కిందపడి,బోండాలను పట్టుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు.
గోనెసంచులను తెచ్చుకుని, మరి ఎగబడి జనం
అందినకాడికి బోండాలను పట్టుకెళ్లారు. దీంతో డ్రైవర్ లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు
చేశాడు. కొందరు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు సైతం బోండాలను తమ వాహనాల్లోకి వేసుకుని,
పరుగులు తీశారు. డీసీఎం డ్రైవర్ లబోదిబోమంటూ సదరు గ్రామస్తులు, వాహనదారులపై
ఫిర్యాదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: