हिन्दी | Epaper

CM Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

sumalatha chinthakayala
CM Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఆ సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకొని సాయంత్రం 5.45 గంటలకు విశాఖలోని కోస్టుగార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆంధ్ర వైద్య కళాశాలకు చేరుకుని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మించిన శతాబ్ది భవనాన్ని ప్రారంభిస్తారు. రాత్రి 7.25 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవుతారు.

నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం

మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు

ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10 వేల నుంచి రూ.20వేలకు ప్రభుత్వం పెంచింది. మత్స్యకారులకు రూ. 258 కోట్లు నిధులను ప్రభుత్వం అందించనుంది. సీఎం చంద్రబాబు పర్యటన కోసం 1500 మంది భద్రతా సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి, అనంతరం చెక్కుల పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు తమ గ్రామానికి వస్తుండటంతో బుడగట్లపాలెం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ పర్యటనతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మత్స్యకారులకు నూతన ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి.

Read Also: మత్స్యకారుల సేవలో.. నేడు అకౌంట్లలోకి రూ.20వేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870