ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రెండు రోజుల అధికారిక పర్యటన కోసం నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరి, సుమారు 11.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి కేంద్ర సహకారం పొందడమే లక్ష్యంగా ఆయన పలు కీలక కేంద్ర మంత్రులను కలవనున్నారు.
కేంద్ర హోంమంత్రితో ముఖ్య భేటీ
చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah )తో సమావేశమవుతారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల అంశాలు, నక్సలైట్ ప్రాంతాల్లో అభివృద్ధి, పోలీస్ బలగాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది. అనంతరం ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్‌ను, ఐటీ శాఖ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన కలిసే అవకాశం ఉంది.
రేపు ఆర్థిక, కార్మిక, జలశక్తి మంత్రులతో సమావేశాలు
రేపు చంద్రబాబు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లతో సమావేశం అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, నిధుల విడుదల, ఉద్యోగావకాశాలు, నీటి పారుదల ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రంతో సత్సంబంధాలను నెలకొల్పి రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమీకరించేందుకు చంద్రబాబు ఈ పర్యటనను ప్రాధాన్యతతో తీసుకున్నారు.
Read Also : Permit Rooms : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్?