ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భారీగా హామీలు ప్రకటించారు. కుప్పం ప్రజలకు నూతన ఆశలు నూర్చే విధంగా, ఆయన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, “కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం” అని ప్రకటించారు.
రూ.1,290 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
కుప్పం (Kuppam) రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కుప్పం–హోసూరు మధ్య మరో రహదారి నిర్మాణం వంటి పలు మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. రూ.1,290 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. విద్యుత్, రవాణా, తాగునీరు తదితర అంశాల్లో కుప్పానికి అత్యాధునిక సౌకర్యాలు అందించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నీటి ప్రాజెక్టు, ఈవీ వాహనాల ప్రోత్సాహం
హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాలను కుప్పానికి తీసుకురావడానికి రూ.3,890 కోట్ల ప్రణాళికను సీఎం ప్రకటించారు. అదే విధంగా, పర్యావరణ హితంగా ఈవీ బస్సులు, ఆటోలను ప్రవేశపెట్టడం, ఇంటింటికీ సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో కుప్పాన్ని గ్రీన్ ఎనర్జీ మోడల్‌గా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా, కుప్పంలో ఎయిర్‌పోర్ట్ స్థాపనకూ సీఎం ఆశావహంగా హామీ ఇచ్చారు.
Read Also : Air India : ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ రీక్రియేట్ చేసిన పైలట్స్