ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2026–27 విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) విద్యార్థి మిత్ర కిట్లను అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన పాఠశాల సామగ్రిని ఉచితంగా అందించి, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
Read Also: Indigo: ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం
రూ.830.04 కోట్లతో కిట్ల పంపిణీకి అనుమతి

విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కోసం మొత్తం రూ.830.04 కోట్ల నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నాణ్యమైన కిట్లు అందించనున్నారు.
కిట్‌లో ఉండే వస్తువులు ఇవే
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్‌లో విద్యార్థులకు అవసరమైన అనేక అంశాలను ప్రభుత్వం చేర్చింది. ఇందులో మూడు జతల యూనిఫాం క్లాత్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, స్కూల్ బ్యాగ్, షూలు, బెల్ట్, డిక్షనరీ వంటి వస్తువులు ఉంటాయి. ఒకే ప్యాకేజీలో అన్ని అవసరాలు తీరేలా ఈ కిట్‌ను రూపొందించారు.
ఈ పథకానికి సంబంధించిన కిట్ల సేకరణ, పంపిణీ వ్యయాల్లో కేంద్ర ప్రభుత్వం( CM Chandrababu) కూడా భాగస్వామ్యం అవుతోంది. మొత్తం వ్యయాల్లో రూ.157.20 కోట్ల మేర కేంద్రం నుంచి నిధులు అందనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీని వల్ల రాష్ట్రంపై పడే ఆర్థిక భారం కొంత తగ్గనుంది.
టెండర్ల ద్వారా పారదర్శక సరఫరా
కిట్ల తయారీ, సరఫరా, పంపిణీ ప్రక్రియలో నాణ్యతతో పాటు పారదర్శకత ఉండేలా టెండర్ విధానం ద్వారా సరఫరాదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం( CM Chandrababu) అధికారులను ఆదేశించింది. విద్యార్థులకు సమయానికి, నాణ్యమైన సామగ్రి అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: