हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

CM Chandrababu: పిల్లల పెంపకానికి వెయ్యి రూపాయలు.. బాబు వరాలు

Saritha
CM Chandrababu: పిల్లల పెంపకానికి వెయ్యి రూపాయలు.. బాబు వరాలు

CM Chandrababu: ఒకప్పుడు జనాభాను తగ్గించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక విప్లవాత్మకమైన “జనాభా నిర్వహణ” పాలసీని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) గణనీయంగా పడిపోవడంతో.. రాబోయే రోజుల్లో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

రూ. 25,000 నగదు ప్రోత్సాహకం ఈ నూతన విధానం ప్రకారం, రెండో బిడ్డ జన్మించిన తల్లిదండ్రులకు “పోషణ్ శిక్షా సురక్ష ప్యాకేజీ” కింద రూ. 25,000 నగదు అందజేయనున్నారు. ఒకవేళ మూడో బిడ్డ పుడితే.. ఆ బిడ్డకు ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు నెలకు రూ. 1,000 పోషకాహార భృతిని కూడా ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాకుండా మూడో బిడ్డకు 18 ఏళ్ల వయస్సు వరకు ప్రభుత్వ లేదా రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు.

Read Also: Andhra Pradesh: విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్ కిన్స్: మంత్రి లోకేష్

CM Chandrababu: పిల్లల పెంపకానికి వెయ్యి రూపాయలు.. బాబు వరాలు
CM Chandrababu: One thousand rupees for child rearing.. Babu

గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. “పాపులేషన్ కంట్రోల్” స్థానంలో “పాపులేషన్ కేర్” విధానాన్ని అమలు చేయనున్నారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతానికి చేరుతుందని, దీనివల్ల యువ కార్మికుల కొరత ఏర్పడి ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.

ఈ జనాభా విధానం కేవలం పిల్లలను కనడంపైనే కాదు, మహిళల భద్రత , ఉపాధిపై కూడా దృష్టి సారించింది. 31 శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తిని 59 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దీనికోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్లు, షీ-క్యాబ్స్, పని చేసే మహిళల కోసం హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికీ 12 నెలల పేరెంటల్ లీవ్ (తల్లికి) , 2 నెలల పటర్నిటీ లీవ్ (తండ్రికి) ఇవ్వాలని ప్రతిపాదించారు.

సంతానలేమి సమస్యతో బాధపడే దంపతుల కోసం పీపీపీ మోడల్‌లో ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యవంతంగా, సంపన్నంగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ ముసాయిదాపై వచ్చే 30 రోజుల పాటు ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870