हिन्दी | Epaper

CM Chandrababu: రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

sumalatha chinthakayala
CM Chandrababu: రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు (గురువారం) బిజీ బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 11.30 నుంచి 1.30 గంటల వరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్‌పై వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సాయంత్రం 06.15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

ప్రధానితో చంద్రబాబు భేటీ

అయితే.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం చంద్రబాబు కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవనున్నారు. మే 2వ తేదీన ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్న సమయంలో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే2న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏపీకి మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. ఎల్లుండి(శనివారం) ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

Read Also: మధుసూదన్‌ రావుకు నివాళులర్పించిన పవన్‌ కల్యాణ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

అమరావతి స్పోర్ట్స్ సిటీపై చంద్రబాబు వ్యాఖ్యలు!

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన నర్సుల సస్పెన్షన్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

‘కల్తీ’కి బాబుదే బాధ్యత: షర్మిల

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు స్వయం ప్రతిపత్తి

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

విద్యుత్ సరఫరాలో సమస్యలు లేవు..

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

ఏపీ టీచర్లకు డబుల్ గుడ్ న్యూస్, కేసులు ఎత్తివేత

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

📢 For Advertisement Booking: 98481 12870