విజయవాడ : ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశసరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. దేశంలో కోటి కోర్సుల దరఖాస్తులను పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) వెల్లడించారు. ఈ పోర్టల్లో కోటికి పైగా ఎనోల్మెంట్లు, 80 లక్షలకు పైగా కోర్సులు పూర్తయ్యాయని.. 4,290 కోర్సుల ద్వారా ఇది సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు.” శుభవార్త కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించింది.. ఇందులో కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. 80 లక్షలకు పైగా కోర్సులకు శిక్షణ పూర్తైంది.
Read Also: SBI: 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

మొత్తం 4,290 కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు నైపుణ్యాభివృద్ధి పొందారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిరంతర అభ్యాసం పట్ల బలమైన(CM Chandrababu) నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్ డిపి) ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఈ కర్మయోగి కార్యక్రమం అమలవుతోంది. నైపుణ్యంతో కూడిన భవిష్యత్తు వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ఈ 30 ఏళ్లలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి జరిగింది. టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. నాడు ఐటీ నేడు ఏఐ వచ్చింది. ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నాం. అమెరికాలో సిలికాల్ వ్యాలీ ఉంది.
మరి ఇండియాలో ఏముంది అని అడిగే వారి కోసం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉంది అన్నది సమాధానమన్నారు. అనాడు సైబరాబాద్ కట్టాం.. నేడు క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు కరెంటు ఉండేది. కాదు… ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. అందుకే నేను ప్రోజ్యూమర్ అనే కొత్త కాన్స్పెన్ట్ తెచ్చాం. అసెంబ్లీలో కరెంటు గురించే గంటల కొద్దీ చర్చలు జరిగేవి. అందుకే నాడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం.
విద్యుత్ రంగంలో మన దేశం నెంబర్ వన్ గా ఉండటం గర్వ కారణం. అమెరికాలోనూ కూడా నాలుగు గ్రిడ్ లు ఉన్నాయి. ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం మనదే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీకి శ్రీకారం. చుడుతున్నాం. ఇంకో పదేళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు ఎలా ఉంటాయే చూస్తారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయి. గుంటూరు కు182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. రెన్యువబుల్ ఎనర్జీతో పొల్యూషన్ అనేది ఉండదు. 1995లో నేను ఐటీని ప్రమోట్ చేశాను. 2000లో బయో టెక్నాలజీ ప్రమోట్ చేశాను. జీనోమ్ వ్యాలీకి భూములిచ్చాం. కొవిడ్ వ్యాక్స్ న్ భారత్ బయోటెక్ జినామ్ వ్యాలీ నుంచి తయారుచేసింది. ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పేరుతో కొత్త ప్రాజెక్టు తెస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకరించేందుకు ముందుకొచ్చింది.
కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాం. 70 వేల మందికి క్లీనిక్ టెస్టులు చేశాం. చిత్తూరు జిల్లాలో స్కీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. ఈ ఏడాదిలోనే 28 జిల్లాలు పూర్తిగా సంజీవని ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డులు చేయడమే కాకుండా 72 లక్షలమంది రోగుల డేటా తీసు కుంటున్నాం. ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సర్, న్యూరో సమస్యలపై దృష్టి పెట్టాం. కార్పొరేట్ ఆస్పత్రులు ఫైవ్ స్టార్ హోటళ్లను మించాయి. చికిత్స ఖర్చు కంటే రూమ్ ఖర్చే ఎక్కువవుతోంది. ఈ 2026 డ్రోన్ అంబులెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నాం. పీఎం స్వనిధి కింద 3.42 లక్షల కుటుంబాలకు 978 కోట్లు వంపిణీదేసామని వివరించారు.. మూడు నగరాల్లో తృప్తి క్యాంటీన్లు, 2,673 ఉద్యోగ అవకాశాలతో 18 జాబ్ మేళాలు, మరియు ఆటో డ్రైవర్ సేవాలో పథకం కింద ..436 కోట్ల వ్యయంతో 2.90 లక్షల ఆటో, టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి ..15,000 ఆర్ధిక సహాయం అందించబడింది.
సామాజిక న్యాయం కేంద్రంగా ఉంది. వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీ ఉప వర్గాల మధ్య సమాన రిజర్వేషన్లు కల్పించడానికి ఎస్సీ ఉపవర్గీకరణ దేపట్టబడింది. షెడ్యూల్డ్ కులాల కోసం ఆర్ధిక సహాయం గణనీయంగా పెరిగింది 2019-24 మధ్య సంవత్సరానికి సగటున ..70 కోట్ల నుండి 2024-26లో సంవత్సరానికి ..115 కోట్లకు పెరిగింది. అదనంగా, 11.44 లక్షల మంది ఎస్సీ పెన్షనర్లకు ..3,938.75 కోట్లు విడుదల చేయ బడ్డాయి, హాస్టళ్లు మరియు గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబడ్డాయి. 2025-26 20,692 లబ్దిదారులకు స్థిరమైన. జీవనోపాధిని కల్పించడానికి ఎస్సీ ఆర్థిక సహాయ పథకాల కింద ..341 కోట్లు కేటాయించ బడ్డాయి. వెనుకబడిన తరగతుల విషయాని కొస్తే, ప్రభుత్వం ఆర్థిక సాధికారత మరియు సామాజిక గౌరవానికి కట్టుబడి ఉంది. బీసీ సహకార ఆర్ధిక సంస్థ ద్వారా ఈ సంవత్సరం 11,620 కోట్లు మళ్లించబడ్డాయి. శాసన సభలలో బీసీలకు 33 రిజర్వేషన్తో ప్రాతి నిధ్యం బలోపేతం చేయబడింది మరియు స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవులలో 34 రిజర్వేషన్ను అమలు చేయ డానికి చర్యలు తీసుకుంటున్నారు. విద్య కోసం, ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ..686.64 కోట్లు మరియు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం.. 420,74 కోట్లు విడుదల.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: